నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ వివాదస్పద వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది దిల్లీ హైకోర్టు. ఈ ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
మహాత్మ గాంధీని చంపిన గాడ్సేను ఉద్దేశించి 'స్వతంత్ర భారత మొట్టమొదటి ఉగ్రవాది హిందూవేనని' కమల్ ఓ ఎన్నికల ర్యాలీలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై కోర్టుకెక్కారు భాజపా నేత అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ. ఓట్లు కూడగట్టేందుకు మత ప్రాతిపదికన వ్యాఖ్యలు చేసే వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం సహా అలాంటి పార్టీల గుర్తింపు రద్దు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని దిల్లీ హైకోర్టును కోరారు.
అశ్విని వ్యాజ్యంపై విచారణకు న్యాయస్థానం నిరాకరించింది.
ఇదీ చూడండి: ఠాణా వద్ద మోదీ ధర్నా- 3 గంటలు హైడ్రామా