ఐఎన్ఎక్స్ మనీలాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు చేయాలన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అభ్యర్థనను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. చిదంబరంపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని, నేరంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతం వెళ్తుందని అభిప్రాయపడింది.
ఆగస్టు 21న అరెస్టయిన చిదంబరం... ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు.