కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలోని విశ్వవిద్యాలయాల్లో రానున్న అన్ని సెమిస్టర్, ఫైనల్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శనివారం ప్రకటించారు.
తగిన విధానాలను ఎంపిక చేసి.. విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయమని.. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు డిగ్రీ పట్టా అందజేయాలని విశ్వవిద్యాలయాలకు సూచించినట్టు పేర్కొన్నారు సిసోడియా.
కరోనా సంక్షోభంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాని విషయమని.. అసాధారణ సమయాల్లో అసాధారణ నిర్ణయాలు తీసుకువాలని వెల్లడించారు.