ETV Bharat / bharat

జీరో ఎఫెక్ట్​: దిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా - congress latest news

దిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శుభాశ్ చోప్రా రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఖాతా తెరవలేకపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో వరుసగా రెండోసారి కాంగ్రెస్​కు రిక్తహస్తమే మిగిలింది. ఈసారి ఓట్ల శాతం కూడా భారీగా కోల్పోయినందున పార్టీ నేతల్లో కలవరం మొదలైంది.

delhi congress chief subhash chopra resign
జీరో ఎఫెక్ట్​: కాంగ్రెస్ దిల్లీ అధ్యక్షుడి రాజీనామా
author img

By

Published : Feb 11, 2020, 11:13 PM IST

Updated : Mar 1, 2020, 12:58 AM IST

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ దిల్లీ కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు శుభాష్ చోప్రా. రాజీనామా లేఖను అధిష్ఠానానికి పంపినట్లు చెప్పారు. తుది నిర్ణయం పార్టీ పెద్దలదే అని స్పష్టం చేశారు.

దిల్లీ శాసనసభ ఫలితాల్లో వరుసగా రెండోసారి కూడా ఖాత తెరవలేక పోయింది హస్తం పార్టీ. గతంతో పోలిస్తే ఓట్ల శాతం 9.7నుంచి 4.27కు పడిపోయింది. ఫలితంగా పార్టీ నేతల్లో కలవరం మొదలైంది.

మొత్తం 70 స్థానాలకు గాను అధికార ఆప్​ 62 స్థానాలను కైవసం చేసుకుని వరుసగా మూడోసారి దిల్లీలో అధికారాన్ని చేపట్టనుంది. భాజపా గతంతో పోలిస్తే 5 సీట్లు మెరుగుపడి 8 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.

Last Updated : Mar 1, 2020, 12:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.