ETV Bharat / bharat

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన సీఎం కుమార్తె​

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కేజ్రీవాల్ సైబర్ మోసానికి గురయ్యారు. ఆన్​లైన్ సంస్థ ఓఎల్​ఎక్స్​లో ఆమె అమ్మకానికి పెట్టిన కొన్ని వస్తువులను కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బు చెల్లించకపోగా.. ఆమె ఖాతా నుంచే నగదు బదిలీ చేసుకున్నాడు.

Delhi CM Arvind Kejriwal's daughter falls prey to online fraud
ఆన్​లైన్​ మోసాల బాధితురాలి జాబితాలో కేజ్రీవాల్​ కూతురు
author img

By

Published : Feb 8, 2021, 5:36 PM IST

ఆన్‌లైన్ మోసాలు, సైబర్​ నేరాల బారిన పడుతున్న ప్రముఖుల జాబితాలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ కుమార్తె హర్షిత కేజ్రీవాల్​ చేరారు. ప్రముఖ ఆన్​లైన్​ కొనుగోలు సంస్థ ఓఎల్​ఎక్స్​లో కొన్ని వస్తువులను ఆమె అమ్మకానికి పెట్టారు. వీటిని చూసిన ఒక వ్యక్తి ఆమెను సంప్రదించాడు. ఆ వస్తువులను కొనుగోలు చేసిన అనంతరం ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లిస్తానని చెప్పాడు.

క్యూఆర్​ కోడ్​తో ..

సదరు నిందితుడు హర్షిత కేజ్రీవాల్​ మొబైల్​కి ఒక క్యూఆర్ కోడ్ పంపి.. ఆ కోడ్‌ను స్కాన్ చేయగానే మీ అకౌంట్​లో డబ్బు జమ అవుతుందని నమ్మించాడు. ఆ వ్యక్తి చెప్పినట్టే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే.. హర్షిత ఖాతా నుంచి నిందితుని అకౌంట్​కి నగదు బదిలీ అయిందని పోలీసులు వివరించారు.

ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న దిల్లీ పోలీసు విభాగం.. కేసును సైబర్ సెల్‌కు బదిలీ చేసినట్టు తెలిపింది.

ఇదీ చదవండి: రూ. 2 స్కాన్ చేస్తే రూ. 4 వస్తే.. రూ. 77వేలు స్కాన్ చేస్తే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.