1971లో పాకిస్థాన్‌తో యుద్ధంలో భారత్ విజయానికి.. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని కీర్తిస్తే లేని సమస్య... మెరుపుదాడుల ఘనత మోదీకి ఇస్తే అభ్యంతరాలెందుకని ప్రశ్నించారు దిల్లీ భాజపా నేతలు.
మే 12న పోలింగ్ జరగనున్న దేశ రాజధాని దిల్లీలో రాజ్‌పుత్ సామాజిక వర్గంతో సమావేశం ఏర్పాటు చేసింది భాజపా. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, దిల్లీ-ఉత్తరాఖండ్ భాజపా బాధ్యులు శ్యామ్ జాజు, లోక్‌సభ ఎన్నికల కో-ఇన్ఛార్జ్ జై భన్ సింగ్ పవాయ హజరయ్యారు. 2014కు ముందు ప్రభుత్వాలు సైనికుల త్యాగాలను ఉపేక్షించాయని ఆరోపించారు.
ప్రధాని మోదీ హయాంలో మెరుపు దాడులు నిర్వహించి సైన్యం శత్రు దేశాలకు దీటుగా బదులివ్వగల సామర్థ్యమున్నట్లు నిరూపించుకుందని వ్యాఖ్యానించారు భాజపా నేతలు.
ఇదీ చూడండి: గంభీర్ ప్రచార నిషేధానికి ఈసీకి ఆప్ లేఖ....