ETV Bharat / bharat

పరీక్షలు లేకుండా డిగ్రీలా? రాష్ట్రాలకు ఆ అధికారం లేదు

విశ్వవిద్యాలయ ఫైనల్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 30 లోపు నిర్వహించాలంటూ జూన్‌ 6న యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలను కొందరు విద్యార్థులు సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. కరోనా నేపథ్యంలో ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని.. అందువల్ల యూజీసీ మార్గదర్శకాలను రద్దు చేయాలని వారు కోర్టును కోరారు. దీంతో పరీక్షలు నిర్వహించకుండా..డిగ్రీలు ప్రధానం చేయాలని రాష్ట్రాలు భావించడం సరికాదని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు పేర్కొంది.

Degree without exams? States do not have that power
పరీక్షలు లేకుండా డిగ్రీలా? రాష్ట్రాలకు ఆ అధికారం లేదు
author img

By

Published : Aug 19, 2020, 7:01 AM IST

విశ్వవిద్యాలయాలు పరీక్షలు నిర్వహించకుండా..డిగ్రీలు ప్రధానం చేయాలని రాష్ట్రాలు భావించడం సరికాదని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ధర్మాసనం ముందు యూజీసీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. విశ్వవిద్యాలయ ఫైనల్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 30 లోపు నిర్వహించాలంటూ జూన్‌ 6న యూజీసీ మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని కొందరు విద్యార్థులు సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. కరోనా నేపథ్యంలో ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని.. అందువల్ల యూజీసీ మార్గదర్శకాలను రద్దు చేయాలని వారు కోర్టును కోరారు. దీనిపై మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ విచారణలో వాద ప్రతివాదాలు జరిగాయి. కావాలంటే పరీక్షల నిర్వహణ తుది గడువును పొడిగించమని రాష్ట్రాలు కోరొచ్చు కానీ... పరీక్షలే నిర్వహించకుండా డిగ్రీలు ప్రధానం చేయాలన్న నిర్ణయాన్ని తీసుకునే అధికారం వాటికి లేదని కోర్టుకు మెహతా విన్నవించారు.

తమ రాష్ట్రంలో ఫైనల్‌ పరీక్షలను రద్దు చేసిన మహారాష్ట్ర కూడా తన వాదనలు వినిపించింది. ఐఐటీ లాంటి ప్రఖ్యాత విద్యా సంస్థలే పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీలు ప్రధానం చేస్తే, యూజీసీకి వచ్చిన సమస్యేంటని ప్రశ్నించింది. ఇప్పటికే ఆరింటిలో ఐదు సెమిస్టర్‌ పరీక్షలు జరిగాయని,. ఆరో సెమిస్టర్‌కు సంబంధించి అంతర్గత అసెస్‌మెంట్‌ కూడా పూర్తయిందని.. వాటి ఆధారంగా విద్యార్థుల ప్రతిభను నిర్ణయిస్తే తప్పేంటని వాదించింది. ఈ కేసులో మిగతా పిటిషనర్ల వాదనలను కూడా విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు పేర్కొంది. పిటిషనర్లంతా క్లుప్తంగా తమ లిఖిత పూర్వక వివరణలు మూడు రోజుల్లోపు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: 'స్వచ్ఛ సర్వేక్షణ్' అవార్డులు ప్రకటించనున్న మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.