మే నెలలో తూర్పు లద్దాఖ్‌లోని వివిధ ప్రాంతాల్లో చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడినట్టు రక్షణశాఖ అధికారికంగా అంగీకరించింది. జూన్ నెలలో తమ కార్యకలాపాలకు సంబంధించి.. రక్షణశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన పత్రాల్లో ఈ విషయాన్ని పేర్కొంది.
"2020 మే 5 నుంచి వాస్తవాధీన రేఖ, ముఖ్యంగా గల్వాన్ లోయలో చైనీయుల చొరబాట్లు పెరిగాయి. కుగ్రంగ్ నాలా, గోగ్రా, పాంగాంగ్ సరస్సులోని ఉత్తర భాగంగా మే 17-18 తేదీల్లో చైనీయులు చొరబాటుకు పాల్పడ్డారు."
--- భారత రక్షణశాఖ.
ఇదీ చూడండి:- భారత్ దూకుడు- చైనా సరిహద్దుకు భారీ ట్యాంకర్లు
అయితే.. జూన్ 6న జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల అనంతరం పరిస్థితులు సద్దుమణిగాయని.. కానీ 15వ తేదీన గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘటనతో ఉద్రిక్తతలు పెరిగాయని వెల్లడించింది రక్షణ శాఖ.
జూన్ వరకు ఇరువైపులా వివిధ దఫాలుగా సాగిన చర్చలను ప్రస్తావిస్తూ.. సరిహద్దులో ప్రతిష్టంభన మరికొంత కాలం సాగే అవకాశముందని అభిప్రాయపడింది.
"సమస్య పరిష్కారానికి సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరుగుతున్నప్పటికీ.. సరిహద్దు ప్రతిష్టంభన మరికొంత కాలం ఉండే అవకాశముంది. చైనా దుకుడుతో తూర్పు లద్దాఖ్‌లో ఏర్పడ్డ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. పరిస్థితులకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది."
--- రక్షణ శాఖ నివేదిక.
భారత్-చైనా ఇప్పటివరకు 5 రౌండ్ల కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపాయి. వీటితో పాటు దౌత్య స్థాయిలోనూ సమావేశమయ్యాయి. అయినప్పటికీ.. సరిహద్దులో మే నెలలో మొదలైన ప్రతిష్టంభనకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో తెరపడలేదు.
ఇవీ చూడండి:-