ETV Bharat / bharat

దిల్లీలో అమెరికా-భారత రక్షణ మంత్రుల భేటీ

అత్యంత కీలకమైన 2+2 చర్చల కోసం అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌లు సోమవారం భారత్​కు వచ్చారు. దిల్లీలో వారిద్దరికీ గౌరవ వందనంతో స్వాగతం పలికారు భారత అధికారులు. అనంతరం ఇరుదేశాల రక్షణ మంత్రులు భేటీ అయ్యారు.

Defence Minister Rajnath Singh
అమెరికా-భారత రక్షణ మంత్రుల భేటీ
author img

By

Published : Oct 26, 2020, 4:42 PM IST

Updated : Oct 26, 2020, 5:01 PM IST

భారత్‌-అమెరికాల మధ్య అత్యంత కీలకమైన 2+2 చర్చలు ప్రారంభమయ్యాయి. దిల్లీ వేదికగా రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల కోసం అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి మార్క్‌ ఎస్పర్‌లు భారత్​కు విచ్చేశారు. సోమవారం వారికి గౌరవ వందనంతో భారత అధికారులు స్వాగతం పలికారు.

ఎస్పర్​తో రాజ్​నాథ్​ భేటీ...

భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. ఇవాళ అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్​తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో చీఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​ జనరల్​ బిపిన్​ రావత్​, ఆర్మీ చీఫ్​ జనరల్​ మనోజ్​ ముకుండ్​ నరవణె, ఐఏఎఫ్​ చీఫ్​ ఎయిర్​ చీఫ్​ మార్షల్​ ఆర్​కేఎస్​ బదౌరియా, నేవీ చీఫ్​ అడ్మిరల్​ కరంబిర్​ సింగ్​ పాల్గొన్నారు.

Defence Minister Rajnath Singh
అమెరికా-భారత రక్షణ మంత్రుల భేటీ
Defence Minister Rajnath Singh
మార్క్‌ ఎస్పర్, రాజ్​నాథ్​ సింగ్​

రక్షణ సమాచార మార్పిడి, సైనిక సంప్రదింపులు, రక్షణోత్పత్తుల వ్యాపారంపై ప్రధానంగా చర్చించనున్నారు. అత్యంత కీలకమైన బేసిక్‌ ఎక్స్చేంజీ అండ్‌ కో-ఆపరేషన్‌ అగ్రిమెంట్‌ (బెకా)పై సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి. రెండేళ్ల వ్యవధిలోనే భారత్-అమెరికా మధ్య మూడోసారి 2+2 చర్చలు జరుగుతున్నాయి.

అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ తర్వాత భేటీ కానున్నారు. కీలకమైన ద్వైపాక్షిక అంశాలతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై నేతలు చర్చించనున్నారు. ఇండో పసిఫిక్​లో చైనా దురాక్రమణ యత్నాలు, తూర్పు లద్దాఖ్​లో దుందుడుకు వైఖరి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. పాంపియో, ఎస్పర్​లు.. ప్రధాని మోదీతో సైతం భేటీ అవుతారని అధికారులు తెలిపారు.

Last Updated : Oct 26, 2020, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.