ETV Bharat / bharat

లీచీ వ్యాపారులకు బిహార్ 'మెదడువాపు' కష్టాలు - లీచీ

మెదడువాపు వ్యాధి మరణాలు బిహార్​ను కుదిపేస్తున్నాయి. ఈ వ్యాధి సర్వత్రా చర్చనీయాంశమైంది. దీని ప్రభావం ఇప్పుడు హరియాణా 'లీచీ' రైతులపై పడింది. లీచీ తినడం వల్లే వ్యాధి సోకుతోందన్న వార్తలు జోరందుకోవడమే పండ్లకున్న డిమాండ్​ అనూహ్యంగా పడిపోవడానికి కారణం.

లీచీ వ్యాపారులకు బిహార్ 'మెదడువాపు' కష్టాలు
author img

By

Published : Jun 24, 2019, 7:02 AM IST

లీచీ వ్యాపారులకు బిహార్ 'మెదడువాపు' కష్టాలు

లీచీ... ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పండు. ముఖ్యంగా బిహార్​, హరియాణా రాష్ట్రాల్లో దీనికున్న క్రేజే వేరు. అలాంటిది ఈ పండుకు ఇప్పుడు పెద్ద కష్టమొచ్చింది. లీచీ అమ్మకాలు అనూహ్యంగా పడిపోయాయి. లీచీ రైతులు కుదేలవుతున్నారు. దీనికి కారణం బిహార్​ను కుదిపేస్తున్న 'మెదడువాపు' వ్యాధి మరణాలే.

ఏంటి సంబంధం?

బిహార్​లో 'అక్యూట్​ ఎన్​సెఫలైటిస్​​ సిండ్రోమ్' అంటువ్యాధితో ఇప్పటివరకు 173 మంది ప్రాణాలు కోల్పోయారు. లీచీ పండు తినడం వల్లే ఈ వ్యాధి సోకుతోందని ప్రచారం జోరందుకుంది. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ప్రభావం హరియాణాలోని లీచీ రైతులపై పడింది.

"నేను లీచీ పండ్లు అమ్ముతాను. ఒకప్పుడు 5 బస్తాలు అమ్ముడుపోయేవి. కానీ ఇప్పుడు నాలుగు బస్తాలు అలాగే పడి ఉన్నాయి. ఒక్కటే అమ్ముడుపోయింది."
--- లీచీ రైతు.

పానిపట్​ నగరంలో లీచీకి డిమాండ్​ 90శాతం మేర తగ్గిపోయింది. లీచీ కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుతో ప్రమాదం లేదని హామీ ఇస్తున్నారు.

"ఎప్పటి నుంచో మేము లీచీని అమ్ముతున్నాం. వారం రోజులుగా లీచీ కొనుగోళ్లు పడిపోయాయి. ఎందుకు ఇలా జరుగుతోందో అర్థమవడంలేదు. లీచీ ప్రమాదకరం కాదు. మేము ఈ పండును అమ్ముతున్నాం, తింటున్నాం కూడా. లీచీ వల్ల రోగాలు వస్తున్నాయని కస్టమర్లు అంటున్నారు. ఆ మాటలు అవాస్తవం."
--- దుకాణదారుడు.

లీచీ పండుతో చిన్నారుల మృతికి సంబంధం లేదని డాక్టర్లు చెబుతున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. ప్రజల్లో భయం బలంగా నాటుకుపోయింది.

'బ్రాండ్​ను దెబ్బతీసేందుకే'

లీచీ సమస్యపై బిహార్​ భాజపా ఎంపీ రాజీవ్​ ప్రతాప్​ రూడి లోక్​సభలో ప్రస్తావించారు. లీచీని 'అక్యూట్​ ఎన్​సెఫలైటీస్​​ సిండ్రోమ్' అంటువ్యాధితో ముడిపెట్టి ఆ పండుకున్న బ్రాండ్​ను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని భాజపా ఎంపీ ప్రతాప్​ రూడి ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని అభ్యర్థించారు.

ఇదీ చూడండి:- 173కు చేరిన 'మెదడువాపు' మృతులు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 72 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Darul Makmur Stadium, Kuantan, Malaysia - 22nd June 2019
1. 00:00 Bizarre goal for Herold Goulon of Pahang as his free-kick from inside his own half goes over goalkeeper Hafizul Hakim and into the top corner in stoppage time to cap a 3-1 Pahang victory over Perak in their Malaysian FA Cup semifinal opening leg  
2. 00:16 replays
SOURCE: Football Malaysia
DURATION: 00:27
STORYLINE:
Harold Goulon's amazing stoppage time free kick goal from midfield capped a 3-1 victory for Pahang over visiting Perak in their opening leg Malaysian FA Cup semifinal in Kuantan on Saturday.
Goulon lofted a kick from just over the Pahang side of the midfield line and it made it into the back of the Perak net on the fly for one of the most bizarre goals of the year.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.