ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో 14వేల పందులు మృతి- కారణం? - North East india news

అసోంలో ఆఫ్రికన్​ స్వైన్​ ఫ్లూ విజృంభిస్తోంది. 10 జిల్లాల్లో ఇప్పటికే 14వేలకుపైగా వరాహాలు మరణించాయి.

African swine flu
African swine flu kills over 14000 pigs in 10 districts of Assam
author img

By

Published : May 12, 2020, 6:07 PM IST

కరోనా వైరస్​కు తోడు ఆఫ్రికన్​ స్వైన్​ ఫ్లూ అనేక చోట్ల తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అత్యంత ప్రమాదకర అంటువ్యాధులకు కారణమయ్యే ఈ వైరస్​.. అసోంలో ఇప్పటికే 14,465 పందుల్ని బలిగొంది.

ఈ ఘటనతో వైరస్​ నియంత్రణ చర్యలను మరింత ముమ్మరం చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యామ్నాయ విధానాల్లో వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అతుల్​ బోరా.

ఆఫ్రికన్​ స్వైన్ ఫ్లూ వైరస్.. పంది తినే ఆహారం, దాని లాలాజలం, రక్తం ద్వారా ఇతర వరాహాలకు వ్యాపిస్తుంది. ఈ క్రమంలో ఇతర జంతువులకూ ఈ వైరస్ సోకే అవకాశాలున్నాయి. ఇది తీవ్రమైన జ్వరం కలగజేసి మరణానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో మృతి చెందిన జీవాలను లోతైన గోతుల్లో పూడ్చిపెట్టాలని ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఖననం చేసే సమయంలో వైరస్​ నిర్మూలనలో భాగంగా కళేబరాలపై బ్లీచింగ్​, ఉప్పు చల్లాలని సూచించింది.

వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకుగాను పందులను సామూహికంగా చంపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా... తాము ఆ పని చేయబోమని పేర్కొంది అసోం ప్రభుత్వం. ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ మానవులపై ప్రభావం చూపదని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.