ETV Bharat / bharat

రికార్డుల్లో చనిపోయి.. 15 ఏళ్లకు మనిషిగా బతికి... - 'Dead' man finally proved alive after 15 years

ప్రభుత్వ రికార్డుల ప్రకారం 15 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి... తిరిగి బతికొచ్చారు. ఆయన సజీవంగానే ఉన్నట్లు అధికారులే ధ్రువపత్రం ఇచ్చారు. ఇంతకీ ఎవరాయన? ఏం జరిగింది?

'Dead' man finally proved alive after 15 years in Uttar Pradesh
రికార్డుల్లో చనిపోయి.. మనిషిగా బతికారు
author img

By

Published : Feb 10, 2021, 2:09 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ మీర్జాపుర్​కు చెందిన భోళా సింగ్(65)​.. తాను బతికున్నట్లు రుజువు చేసుకోవడానికి 15 ఏళ్లు పట్టింది.

ఇదీ జరిగింది..

భోళా సింగ్​ ఆస్తిని సొంతం చేసుకోవాలని ఆయన సోదరుడు రాజ్​నారాయణ్​ భావించారు. అందుకు తగ్గట్టుగానే రెవెన్యూ అధికారులతో సఖ్యతగా మెలిగారు. ప్రభుత్వ రికార్డుల్లో భోళా పేరును తొలగించారు. చనిపోయినట్లు ప్రచారం చేశారు. ఈ విధంగా 2005లో తమ సొంత గ్రామం 'అమోయి'లో ఉండే ఆస్తిని తన పేరు మీదకు మార్పించుకున్నారు రాజ్​నారాయణ్​. అయితే నాటి నుంచే భోళా సింగ్​ న్యాయపోరాటం చేశారు. చివరకు 15 ఏళ్ల తరువాత తాను బతికే ఉన్నట్లు నిరూపించుకొని విజయం సాధించారు.

మీడియా సహకారంతో..

15ఏళ్లుగా తాను బతికే ఉన్నట్లు గుర్తించాలని భోళా సింగ్ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. స్థానిక అధికారులు స్పందించకపోగా కలెక్టర్​ కార్యాలయం ముందు కూర్చుని దీక్ష చేపట్టారు. 'సార్..​ నేను బతికే ఉన్నాను. దయ చేసి గుర్తించండి' అని​ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇది గమనించిన అక్కడి మీడియా విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి అతని కేసును సత్వరం పరిశీలించాలని కలెక్టర్​ ప్రవీణ్​కుమార్​ లక్సర్​కు అదేశాలు జారీ చేసింది.

డీఎన్​ఏ టెస్టుతో..

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందుకున్న జిల్లా అధికారులు భోళాసింగ్​, అతని సోదరుడు రాజ్​నారాయణకు డీఎన్​ఏ పరీక్షలు నిర్వహించాలని భావించారు. సాంపిల్‌ ఇచ్చేందుకు రాజ్​నారాయణ నిరాకరించారు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన అధికారులు.. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. గతంలో ఉన్న రికార్డులను పరిశీలించి.. భోళా చెప్పేది నిజమే అని నిర్ధరించుకున్నారు.

చివరకు భోళా సింగ్​ బతికే ఉన్నట్లు అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

ఇదీ చూడండి: భర్త వైద్యం కోసం.. కొడుకునే తాకట్టు పెట్టిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.