ETV Bharat / bharat

కశ్మీర్​లో గుప్కార్​ గుబాళింపు- జమ్మూలో భాజపా హవా - ddc polling

జమ్ముకశ్మీర్​ జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) ఎన్నికల్లో పీపుల్స్​ అలయన్స్​ ఫర్​ గుప్కార్​ డిక్లరేషన్​(పీఏజీడీ) ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఈ కూటమి 100కుపైగా స్థానాల్లో విజయం సాధించింది. భాజపా అతిపెద్ద పార్టీగా నిలిచింది. కశ్మీర్​లో తొలిసారి ఖాతా తెరిచిన కమలం పార్టీ.. జమ్మూలో ఆధిపత్యం చెలాయించింది.

ddc-elections-vote-counting-stopped-in-hajin-a-and-drugmulla
కశ్మీర్​లో గుబ్కార్​ గుబాళింపు- జమ్మూలో భాజపా హవా
author img

By

Published : Dec 23, 2020, 5:18 AM IST

Updated : Dec 23, 2020, 6:06 AM IST

జమ్ముకశ్మీర్​లో 370 అధికరణం రద్దు తర్వాత నిర్వహించిన తొలి జిల్లా అభివృద్ధి మండళ్ల(డీడీసీ) ఎన్నికల్లో ఏడు స్థానిక పార్టీల కూటమి 'పీపుల్స్​ అలయన్స్​ ఫర్​ గుప్కార్​ డిక్లరేషన్​(పీఏజీడీ)' సత్తా చాటింది.

నేషనల్​ కాన్ఫరెన్స్​(ఎన్​సీ), పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ(పీడీపీ) లాంటి ప్రధాన పార్టీలతో పాటు మరికొన్ని చిన్నపార్టీలతో ఏర్పడిన ఈ కూటమి 280 స్థానాలకు గానూ 100 చోట్ల విజయబావుటా ఎగరేసింది. మరో 12 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకెళ్తోంది.

  • భాజపా 73 స్థానాల్లో గెలుపొంది ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. మరో 18 చోట్ల విజయానికి చేరువలో ఉంది. ముఖ్యంగా కశ్మీర్​ లోయలో పీఏజీడీ తిరుగులేని హవా కొనసాగించగా, జమ్మూలో భాజపా పట్టు నిలుపుకొంది.
  • కాంగ్రెస్​ 22 స్థానాలను కైవసం చేసుకొని మరో 5 చోట్ల ఆధిక్యంలో ఉంది. 47 మంది స్వతంత్ర అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. మరో ఆరు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
  • జమ్ము అండ్​ కశ్మీర్​ అప్నీ పార్టీ 11 చోట్ల మాత్రమే విజయాన్ని అందుకుంది. మరొక చోట గెలిచే అవకాశముంది.
  • బందిపొరా, కుప్వారా జిల్లాల్లోని హాజిన్​-ఎ, ద్రుగ్​ముల్లా నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన మహిళా అభ్యర్థులు షాజియా అస్లాం, సోమియా సదాఫ్​ల జాతీయతపై వివాదం తలెత్తగా ఓట్ల లెక్కింపును నిలిపివేశారు.

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే. మొత్తం 8 దశల్లో పోలింగ్​ నిర్వహించారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో స్థానిక సమరం- ఎందుకింత ప్రాధాన్యం?

కశ్మీర్​ లోయలో భాజపాకు తొలి విజయం..

కశ్మీర్​లో కాషాయ పార్టీ తొలిసారిగా గెలుపు రుచిచూసింది. ఇక్కడి ఖొన్​మొహ్​-2, తులాలి, కక్పొరా స్థానాల్లో భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. కశ్మీర్​ చరిత్రలోనే భాజపా ఎన్నికల్లో గెలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

తొలిసారి కశ్మీర్‌ వ్యాలీలో భాజపా ఖాతా తెరవడంపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌.. ప్రధాన మంత్రినరేంద్ర మోదీని కశ్మీర్‌ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని అన్నారు

జైల్లో ఉన్న పీడీపీ అభ్యర్థి జయకేతనం..

ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న కారణంతో.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) అరెస్టు చేసిన పీడీపీ అభ్యర్థి వహీద్​ పారా పుల్వామా-ఎ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ పార్టీ యువ విభాగం అధ్యక్షుడిగా ఉన్న వహీద్​ను ఎన్నికల కోసం నామినేషన్​ వేసిన మరుసటి రోజే ఎన్​ఐఏ అదుపులోకి తీసుకుంది.

భాజపాకు కనువిప్పు: ఒమర్​ అబ్దుల్లా

డీడీసీ ఎన్నికల ఫలితాలు భాజపాకు కనువిప్పు అని నేషనల్​ కాన్ఫరెన్స్​ ఉపాధ్యక్షుడు ఒమర్​ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా రద్దు నిర్ణయాన్ని ప్రజలు తిరస్కరించినట్లు చెప్పారు.

370 రద్దుకు తిరస్కరణ: మెహబూబా

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాన్ని ప్రజలు తిరస్కరించారని ఎన్నికల ఫలితాలతో తేలిందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ఆర్టికల్​ 370 పునరుద్ధరణ కోసం పోరాడుతున్న గుప్కార్​ కూటమికి భారీగా ఓట్లు వేసి ప్రజలు అండగా నిలిచారని తెలిపారు.

ఇదీ చూడండి: '370 పేరుతో గుప్కర్​ గ్యాంగ్ కొత్త నాటకం'

Last Updated : Dec 23, 2020, 6:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.