ETV Bharat / bharat

వేలానికి అండర్​ వరల్డ్ డాన్ దావూద్​ ఆస్తులు - కొంకణ్​ దావూద్​ ఆస్తులు

అండర్​ వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను వేలానికి వేయనున్నారు. మహారాష్ట్ర కొంకణ్​ ప్రాంతంలో ఈ ఆస్తులు ఉన్నాయి. ఇక్కడే దావూద్​ పూర్వీకులు నివాసముండేవారు. ఆస్తుల్లో ఓ విశాలమైన భవనం కూడా ఉంది.

Dawood Ibrahim's properties in Konkan to be auctioned
వేలానికి దావూద్​ ఇబ్రహీం ఆస్తులు
author img

By

Published : Oct 18, 2020, 2:25 PM IST

Updated : Oct 18, 2020, 2:34 PM IST

మహారాష్ట్ర కొంకణ్​​ ప్రాంతంలోని అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ ఇబ్రహీం ఆస్తులను అధికారులు వేలం వేయనున్నారు. ఇందుకు సంబంధించి ఆస్తుల వేల్యువేషన్​ ప్రక్రియ గతేడాదే ముగిసింది.

కొంకణ్​ ప్రాంతానికే చెందిన వ్యక్తి దావూద్​. రత్నగిరి జిల్లా ఖేడ్​ తాలుకాలోని ముంబ్కే గ్రామంలో అతడి పూర్వీకులు నివాసముండేవారు. ఈ గ్రామంతో పాటు అనేక ప్రాంతాల్లో దావూద్​కు స్థిరాస్తులు ఉన్నాయి. ఖేడ్​లోని విలువైన ఆస్తులు అతడి సోదరి హసినా పార్కర్ పేరు మీద​, మిగిలినవి తల్లి అమినా పేరు మీద ఉన్నాయి.

వేలానికి బంగ్లా...

1980లలో ఇక్కడ ఉన్న బంగ్లాలోనే దావూద్​ కుటుంబసభ్యులు నివాసముండేవారు. దీనిని దావూద్​ ఎంతో విలాసవంతంగా తీర్చిదిద్ది తన తల్లి పేరు మీద ఆస్తి రాయించాడు. 1993 ముంబయి పేలుళ్ల అనంతరం దీనిని దావుద్​ కుటుంబసభ్యులు విడిచిపెట్టారు. అప్పటి నుంచి బంగ్లా ఖాళీగానే ఉంది. కానీ ఇప్పుడు ఇది శిథిలావస్తకు చేరింది. ఏ నిమిషంలోనైనా కూలిపోయే పరిస్థితికి నెలకొంది.

తాజాగా ఆదివారం ముంబ్కే గ్రామంలో పర్యటించిన అధికారులు.. దావూద్​ ఆస్తులపై సర్వే నిర్వహించారు. స్మగ్లర్స్​- ఫారిన్​ ఎక్స్​ఛేంజ్​ మేనిపులేటర్స్​ చట్టం కింద వీటిని వేలం వేయనున్నారు. మొత్తం 7 ఆస్తులను వేలం వేయడానికి సన్నద్ధమవుతున్నారు. వీటి విలువ(క్యుములేటివ్​ వాల్యూ) రూ. కోటి.

ఇదీ చూడండి:- కేరళ గోల్డ్​ స్మగ్లింగ్​ కేసుకు దావుద్​తో లింకేంటి?

Last Updated : Oct 18, 2020, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.