సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఓ అమ్మాయి పాడింది. దీన్ని సహించని కొంత మంది ఆమెపై పగబట్టారు. ఆమె కుటుంబ సభ్యులను అప్పటి నుంచి అనుసరించడం మొదలుపెట్టారు. చిన్నారిపై కోపాన్ని ఆమె తండ్రిపై తీర్చుకున్నారు. రాత్రివేళ ఇంట్లోకి చొరబడి చిన్నారి తండ్రి అలంక్రిత్ రాయ్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు . అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్పృహ కోల్పోయాక గంగానదీ తీరంలో వదిలేసి వెళ్లిపోయారు.
బిహార్ కటిహార్ జిల్లా బిరార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ సంఘటన జరిగింది.
శునకం సాయంతో ఆచూకీ
అలంక్రిత్ రాయ్ కోసం వెతికిన కుటుంబ సభ్యులకు మొదట అతని ఆచూకీ తెలియలేదు. చివరకు జాగిలం సాయంతో రాయ్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. తీవ్రగాయాలతో పడి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అలంక్రిత్ చికిత్స పొందుతున్నాడు.
"నిద్రపోతున్న వ్యక్తిని ఎత్తుకెళ్లారు. దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నదీతీరంలో వదేలిసి వెళ్లిపోయారు. జాగిలం సాయంతో రాయ్ ఆచూకీ కనుగొన్నాం."
- రాయ్ కుటుంబ సభ్యురాలు
తన కూతురు మోదీ కోసం పాట పాడటం వాళ్లకు ఎందుకు నచ్చలేదో తెలియదని రాయ్ చెప్పాడు. ఆరుగురు వచ్చి తనను ఇంట్లోనుంచి ఎత్తుకెళ్లి దాడి చేశారని తెలిపాడు.
ఇదీ చూడండి: బోధి వృక్షం నుంచి జలధారలు..!