కూరగాయల కోసం 30 రూపాయలడిగినందుకు భార్యకు తలాక్ చెప్పేశాడో భర్త. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలోని గ్రేటర్ నోయిడాలో జరిగింది.
నోయిడాలోని జైనబ్‌కు ఇదే ప్రాంతంలోని సాబీర్తో తొమ్మిదేళ్ల కింద వివాహమైంది. అనంతరం సాబీర్ కుటుంబం నుంచి జైనబ్‌కు వరకట్న వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయమై అనేక సార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది.
భర్తను కూరగాయల కోసం 30 రూపాయలు ఇవ్వాలని కోరింది జైనబ్. ఆగ్రహించిన సాబీర్ ఆమెపై భౌతిక దాడి చేశాడు. ఆ సమయంలోనే అక్కడికి చేరుకున్న జైనబ్ తండ్రి సమక్షంలో జైనబ్‌కు ముమ్మారు తలాక్ చెప్పేశాడు. గాయాలతో ఉన్న ఆమెను తండ్రి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాడు. అనంతరం దాదరీ పోలీసు స్టేషన్లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు.
వివాహమైన కొద్ది రోజుల నుంచే సాబీర్ తమ కూతురిని వరకట్నం కోసం వేధించేవాడని వాపోయారు బాధితురాలి తల్లి. అనేకసార్లు పంచాయతీ నిర్వహించినప్పటికీ క్షమాపణలు చెప్పి తప్పించుకునేవాడన్నారు.
ఇదీ చూడండి: పులి వేట నుంచి తప్పించుకున్న బైకర్లు