దేశంలో కరోనా కేసులు మొదటి నెల రోజుల్లో పెద్దగా పెరగలేదు. ఆ నెలంతా కూడా కేవలం 3 కేసులే నమోదయ్యాయి. రెండో నెలలో కేసుల సంఖ్య క్రమేపీ పెరిగిపోయింది. ఈ ఏడాది జనవరి 30 నాటికి మొదటి కేసు నమోదు కాగా తర్వాత 5వ వారం వరకూ కూడా 28 కేసులే నమోదయ్యాయి. అనంతరం దాదాపు 4 వారాలకే కేసుల సంఖ్య 2000 దాటింది.
- జనవరి 30 నాటికి ఒకటే కేసు.
- కేసుల సంఖ్య 10కి చేరడానికి 34 రోజులు పట్టింది.
- ఆ తర్వాత 6 రోజుల్లో కేసులు 50కి పెరిగాయి.
- తర్వాత 4 రోజుల్లో కేసుల సంఖ్య 100 దాటింది.
- అనంతరం 6 రోజులకు కేసులు 200కి చేరాయి.
- తర్వాత 4 రోజుల్లో 500 దాటాయి.
- తర్వాత 5 రోజుల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.
- తర్వాత 3 రోజుల్లోనే 1800 దాటాయి.
- తర్వాత ఒక రోజులో కేసుల సంఖ్య 2 వేలు దాటింది.
-
ఇదీ చూడండి:కరోనా కట్టడిలో 'హీరోల' తీరు స్ఫూర్తిదాయకం