ETV Bharat / bharat

కరోనా కట్టడిలో 'హీరోల' తీరు స్ఫూర్తిదాయకం - పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వైద్యులు

అసలే కరోనా కాలం. ప్రజలందరూ ఎక్కడికక్కడ గృహ నిర్బంధంలో ఉన్న కాలం. ఈ సమయంలో వందలు, వేల సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వైద్యులు తమ భద్రతనే పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న తీరు స్ఫూర్తిదాయకం. కరోనా విపత్తులో కొవ్వొత్తిలా తాము కరిగిపోయినా పరవాలేదు కానీ, సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే వాళ్ల తాపత్రయం వెలకట్టలేనిది.

Doctors, Sanitation workers, Police are the real heroes of our society in the outbreak of corona
కరోనా విపత్తులో కొవొత్తిలా కరిగిపోతూ... వారే స్ఫూర్తిదాయకం
author img

By

Published : Apr 3, 2020, 6:44 AM IST

ఇంట్లో ఉన్న మనుషులను తాకుదామంటేనే వణుకుతున్న రోజుల్లో- తమకేం సంబంధం లేని మనుషులు వేసిన చెత్త తీస్తున్న ఈ కార్మికుల రుణం ఎట్లా తీర్చుకోగలం? కన్నబిడ్డను తనివితీరా ముద్దాడదామంటే ధైర్యం చాలని రోజులివి. ఎవరిని తాకితే వైరస్‌ సోకుతుందోననే భయంతో రోజూ పదులసార్లు శానిటైజర్లతో చేతులు శుభ్రపరచుకుంటున్న కాలమిది. ఈ పారిశుద్ధ్య కార్మికులు నిస్వార్థంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎందుకు పనిచేస్తున్నారు? కరోనా విపత్తులో కొవ్వొత్తిలా తాము కరిగిపోయినా పరవాలేదు కానీ, సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే వాళ్ల తాపత్రయం చూస్తుంటే ఆశ్చర్యమనిపించింది.

శార్వరి నామ సంవత్సరాది (ఉగాది) రోజున ఉదయాన్నే ఓ మిత్రుడు ఫోన్‌ చేశాడు. తన ఊరికి డెబ్బై కిలో మీటర్ల దూరంలో ఉన్న అతడి అమ్మమ్మ చనిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉంది కాబట్టి, ఆమె పార్థివదేహాన్ని తన స్వగృహానికి చేర్చేందుకు నా సహాయం అర్థించాడు. అంత్యక్రియల అనంతరం ఆ మిత్రుడు విధులకు హాజరయ్యాడు. కార్యక్రమాలు ఎలా జరిగాయంటూ అడిగాను. అంతే... అతను కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ వృద్ధురాలు చనిపోయింది గుండె నొప్పితో. కానీ, ఊరివాళ్లంతా ఆమెకు కరోనా వైరస్‌ సోకిందేమోనన్న భయంతో అంత్యక్రియలకు సైతం హాజరు కాలేదట. నలుగురు బంధువులు పోగయి నేరుగా శ్మశానానికి తీసుకెళ్లారట.

ఇంకా విషాదమేమిటంటే కనీసం పూడ్చిపెట్టే బొంద తవ్వేందుకు మనుషులు లేకపోతే- యంత్ర సహాయంతో బొంద తీసి, అదే యంత్ర సహాయంతో ఆ వృద్ధురాలి భౌతిక కాయాన్ని ఖననం చేశారట. ‘ఎంతోమందిని పెంచి పెద్దచేసిన అమ్మమ్మ దిక్కులేనిదానిలా అనంతలోకాలకు పోయింది సార్‌’ అంటూ అతడు కన్నీటి పర్యంతమైన తీరు చూస్తే గుండె తరుక్కుపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో తనకు ఏ మాత్రం తెలియని, సంబంధంలేని వ్యక్తికి కరోనా వైరస్‌ సోకిందని తెలిస్తే చాలు- భార్యాపిల్లల్ని, కన్న తల్లిదండ్రులను ఆఖరికి తనను తానే మరిచి చికిత్స అందిస్తున్న వైద్యుడు ఎంత గొప్పవాడు? ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిద్రాహారాలు మాని వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు ఈ సమాజానికి చేస్తున్న కృషిని గురించి ఎంత చెప్పినా తక్కువే. మనకు కనిపించే వైద్యులతో పాటు కనిపించని వైద్యులూ ఉన్నారు. వాళ్లే కరోనాకు మందు కనుగొనాలన్న లక్ష్యంతో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న శాస్త్రవేత్తలు. ల్యాబోరేటరీల్లో వాళ్లు చేస్తున్న ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. దేశవిదేశాల్లోని అనేకమంది శాస్త్రవేత్తలకు శతకోటి వందనాలు. ఈ కష్టకాలంలో ఎలాంటి అవాంతరాలూ లేకుండా అనునిత్యం సమాజానికి వెలుగులు పంచుతున్న విద్యుత్‌రంగ సిబ్బంది సేవలూ కొనియాడదగినవే.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెప్పినా వినకుండా ‘అక్కడెక్కడో చైనా వాడికి వచ్చింది కరోనా. అగ్రరాజ్యం అమెరికోనికీ వచ్చింది. నేను కనీసం హైదరాబాద్లో కూడా లేను. ఇక్కడెక్కడో మారుమూల పల్లెటూర్లో ఉన్నా. నాకెందుకు వస్తుంది కరోనా’ అనుకుంటూ చాలామంది గ్రామీణులు కరోనా వైరస్‌ గురించి అవగాహనలేమితో మాట్లాడటం నేను విన్నాను. అసలు కరోనా కట్టడి పక్కనపెడితే- ఇలా ఆలోచించేవారిని కట్టడి చేయడం ఎంతో కష్టం. ఇలాంటివారు సైతం ఇప్పుడు గృహ నిర్బంధంలో ఉన్నారంటే కారణం పోలీసే. 24 గంటలూ తాము రోడ్డుపై కష్టపడుతూ, యావత్‌ సమాజాన్నీ వైరస్‌కు దూరంగా ఉంచాలనే పోలీసుల తపన గురించి ఎంత చెప్పినా తక్కువే. సరిహద్దుల్లోని సైన్యం కనిపించే శత్రువుతో పోరాటం చేస్తుంటే, మన యంత్రాంగం కనిపించని శత్రువుతో అనునిత్యం సమరం సాగిస్తోంది. మానవాళి ఎదుర్కొంటున్న మహావిపత్తులో వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు అందిస్తున్న సేవలు ఎంతో అమూల్యమైనవి. వీరికి సమాజం నుంచి సంపూర్ణ తోడ్పాటు దక్కాలి. వారి కుటుంబాలకు, వారికి బాసటగా ఉండాల్సిన తరుణమిది. వాళ్లంతా మన కోసం కంటికి నిద్ర, ఒంటికి విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు.

సామాజిక దూరం పాటించాలని అందరికీ చెబుతారు కానీ, వాళ్లకు ఆ అవకాశం లేదు. అందరూ ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు చేస్తారు.. వాళ్లు మాత్రం రోడ్లపైనే ఉండక తప్పని పరిస్థితి. మన సంక్షేమం కోసం, నిరంతరం కష్టపడుతున్న వాళ్లు సమాజహితులు. కొన్ని సందర్భాల్లో వైద్యులపై దాడులు కూడా జరుగుతున్నాయి. ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు. కరోనాను అదుపు చేసేందుకు శ్రమిస్తున్న వైద్యులకు సహకరించడం అందరి బాధ్యత. మన సమాజంలో స్వేచ్చ ఎక్కువ. దీన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. మనకోసం రేయింబవళ్లు కష్టపడుతున్న వైద్యసిబ్బందికి, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి నిజంగా చేయూత ఇవ్వాలంటే, సమాజ హితం కోరుకునేవారు బాధ్యతతో మెలగాలి. కొవిడ్‌-19 బారినపడి ప్రపంచంలోని అన్ని దేశాలూ దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. మనం జాగరూకతతో ఉండాలి. ఇంట్లోనే ఉండాలి. అత్యవసరమై బయటికి వచ్చినా సామాజిక దూరం పాటించాలి. ప్రతి ఒక్కరూ వైరస్‌ గురించి తెలుసుకోవాలి. ‘ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో... ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో...’ అంటూ దాశరధి కృష్ణమాచార్య చెప్పినట్టు వీళ్లంతా కానరాని భాస్కరులే. మన కోసం శ్రమిస్తున్నవారి సేవలకు వెలకట్టలేం- తలవంచి నమస్కరించడం తప్ప!

ఇదీ చూడండి : దేశంలో కరోనా కలవరం.. భారీగా పెరుగుతున్న కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.