ETV Bharat / bharat

తీరం దాటిన నిసర్గ - పెనుగాలుల బీభత్సం - మహారాష్ట్ర అలీబాగ్ వద్ద తీరాన్ని దాటిన నిసర్గ తుపాను

నిసర్గ తుపాను మహారాష్ట్ర రాయ్​గఢ్ జిల్లాలోని అలీబాగ్ సమీపంలో తీరం దాటింది. 110 నుంచి 120 కి.మీ వేగంతో పెనుగాలులు, భారీ వర్షాలతో అల్లకల్లోలం సృష్టించింది. ముందుగానే అప్రమత్తమైన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు.. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

cycloneNisarga crossed Maharashtra coast between Harihareshwar & Daman
పెనుగాలులు, భారీ వర్షాలతో తీరం దాటిన నిసర్గ
author img

By

Published : Jun 3, 2020, 6:29 PM IST

Updated : Jun 3, 2020, 8:39 PM IST

అరేబియా సముద్రంలో ఏర్పడ్డ నిసర్గ తుపాను మహారాష్ట్ర, రాయ్​గఢ్​ జిల్లా అలీబాగ్ సమీపంలో తీరం దాటింది. దాదాపు మూడు గంటల తర్వాత మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో పూర్తిగా నిసర్గ తీరం దాటినట్లు జాతీయ వాతావరణ విభాగం తెలిపింది.

తుపాను ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. 43 ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

రైళ్లు రద్దు

నిసర్గ తుపాను కారణంగా ముంబయి విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే పలు రైళ్లు రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు.

సహాయక చర్యలు

జాతీయ విపత్తు దళానికి (ఎన్​డీఆర్​ఎఫ్) చెందిన 43 బృందాలు గుజరాత్​, మహారాష్ట్రలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. తీర, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక లక్ష మందిని సహాయక శిబిరాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. నౌకాదళం కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటోంది.

పునరావాస కేంద్రాలు

భీకర తుపాను కారణంగా ముంబయి తీరంలో ప్రజల రాకపోకలను నిషేధించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని పోలీసులు హెచ్చరించారు. ముంబయిలోని 35 పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా మార్చారు.

గుజరాత్ అప్రమత్తం

నిసర్గ తుపాను నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన గుజరాత్​ ప్రభుత్వం తీరప్రాంతాల్లోని 78 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

నేనున్నాను

ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ, అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: 'ఇండియా పేరు మార్పుపై ఆదేశాలివ్వలేం'

Last Updated : Jun 3, 2020, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.