ETV Bharat / bharat

అంపన్​ పంజా: బంగాల్​లో 80కి చేరిన మృతులు - telugu news

బంగాల్​​లో అంపన్ తుపాను సృష్టించిన విధ్వంసంలో మృతుల సంఖ్య 80కి చేరింది. ఇళ్లు కూలిపోయి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలో నిలిచిపోయిన మొబైల్​, విద్యుత్​ సేవలను పునరిద్ధరిస్తోంది ప్రభుత్వం.

Cyclone toll in WB rises to 80; electricity, mobile services restored in some worst-hit areas
'అంపన్'​ విషాదం: బంగాల్​లో 80కి చేరిన మృతులు
author img

By

Published : May 22, 2020, 12:30 PM IST

అంపన్ తుపాను బంగాల్​ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. మృతుల సంఖ్య 80కి పెరిగింది.

తుపాను ధాటికి వంతెనలు, విద్యుత్ స్తంభాలు, ట్రాఫిక్​ సిగ్నల్​ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇళ్లు కొట్టుకుపోయి, భవనాలు కూలిపడి కోల్​కతా సహా దాదాపు 12 జిల్లాల్లో.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. కొన్ని జిల్లాల్లో మొబైల్​, విద్యుత్​ సేవలను పునరుద్ధరించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు సహాయక దళాల సిబ్బంది తీవ్రంగా శ్రమించి శరణార్థులను కాపాడుతున్నారు.

"అంపన్​ ధాటికి కూలిన వేలాది చెట్లను తొలగిస్తున్నాం. కానీ, పునరుద్ధరించాల్సింది చాలా ఉంది. రెండు మూడు రోజుల్లో పరిస్థితిని సాధారణంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. అప్పటి వరకు ప్రజలను ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాం."

-ఫిర్హద్​ హకీం, కోల్​కతా మేయర్​

డిమాండ్​...

అంపన్​ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్​ చేశారు. విపత్తును ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది.

మృతుల కుటుంబసభ్యులకు రూ.2-2.5 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు దీదీ. అంపన్​ నష్టాన్ని భర్తీ చేసేందుకు వెయ్యి కోట్ల కార్పస్​ నిధిని ప్రకటించారు.

ఇదీ చదవండి:'అంపన్​'పై మోదీ సమీక్ష- బంగాల్​లో విహంగ వీక్షణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.