ETV Bharat / bharat

ముంచుకొస్తున్న నివర్- 3 రోజులు భారీ వానలు - ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలపై నివర్ తుపాను ప్రభావం

బంగాళాఖాతలంలో ఏర్పడిన వాయుగుండం.. రాగల 12 గంటంలో తుపానుగా మారనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వాయుగుండం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృమైనట్లు తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు వివరించింది. ఈ తపానుకు 'నివర్' అనే పేరు పెట్టనున్నారు.

Nivar Cyclone updates
నివర్ తుపాను అప్​డేట్స్
author img

By

Published : Nov 24, 2020, 5:29 AM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం మరింత తీవ్రంగా మారింది. వాయుగుండం ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 12 గంటల్లో వాయుగుండం తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరో 24 గంటల్లో ఈ వాయుగుండం తుపానుగా బలపడనుంది. ఈ తుపానుకు 'నివర్' అనే పేరు పెట్టనున్నారు.

పుదుచ్చేరిలోని కరైంకల్‌ -మామళ్లపురం మధ్య 25న తుపాను తీరం దాటే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు సుమారు 100-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో చెన్నై, కడలూర్​, నాగపట్నం, ఎన్నోర్, పుదుచ్చేరి సహా పలు ప్రాంతల్లో ఇప్పటికే మూడో నంబర్ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

తుపాను హెచ్చరికలతో చెన్నై సహా.. పలు తుపాను ప్రభావిత ప్రాంతాలకు 6 రైళ్లను పూర్తిగా, 9 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు రైల్వే అధికారులు.

బస్సు సర్వీసులు నిలిపివేత..

తుపాను ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనాలున్న.. పుదుకొట్టాయ్, తంజావూరు, తిరువారూర్, కడలూర్ సహా పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనీ స్వామి ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బస్సు సర్వీసులు ప్రారంభించొద్దని స్పష్టం చేశారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు.

మరిన్ని వివరాలు..

వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రతో పాటు తమిళనాడులోని ఉత్తర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణల్లో మూడు రోజుల పాటు వానలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. కొన్నిచోట్ల సాధారణ వర్షాలు, అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది.

ముందస్తు జాగ్రత్తలు..

తుపాను హెచ్చరికలతో ముందస్తు చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలకు 30 జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్​డీఆర్​ఎఫ్​) బృందాలను కేటాయించారు. ఒక్కో బృందంలో 35 నుంచి 45 మంది సిబ్బంది ఉంటారు.

ఇప్పటికే 12 బృందాలు ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి. మరో 18 బృందాలు అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఇదీ చూడండి:అక్కడ మళ్లీ రాత్రి కర్ఫ్యూ- విద్యాసంస్థలు బంద్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.