ETV Bharat / bharat

'దేశంలో ప్రతి సంక్షోభానికి మోదీ విధానాలే కారణం' - కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో సీడబ్ల్యూసీ సమావేశమైంది. దేశంలో ప్రతి సంక్షోభానికి మోదీ ప్రభుత్వం చేపట్టే విధానాలే కారణమని ఆరోపించారు సోనియా. చైనాతో సరిహద్దు వివాదం ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ హెచ్చరించారు.

CWC to meet today to discuss stand-offs with China, Nepal
'దేశంలో ప్రతి సంక్షోభానికి మోదీ విధానాలే కారణం'
author img

By

Published : Jun 23, 2020, 12:02 PM IST

Updated : Jun 23, 2020, 12:49 PM IST

సరిహద్దులో చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. కరోనా సంక్షోభం, సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జరిగిన కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీలో మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో మండిపడ్డారు సోనియా.

"ప్రస్తుతం దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చైనా - భారత్ మధ్య సరిహద్దు వివాదం నెలకొంది. ప్రతి సంక్షోభానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలే కారణం. భారీ ఆర్థిక ఉద్దీపన, పేద ప్రజల చేతుల్లోకి నేరుగా డబ్బులు వెళ్లేలా చర్యలు, ఎమ్ఎస్ఎమ్ఈ లను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్రపంచవ్యాప్తంగా ముడి చుమురు ధరలు పడిపోతున్నా.. వరుసగా 17 రోజులుగా ఇంధన ధరలను పెంచుతూ సామాన్యుడి నడ్డి విరిచారు. అధికార యంత్రాంగం అంతా.. చేతుల్లో ఉన్నా మహమ్మారి విజృంభనను కట్టడి చేయడంలో మోదీ విఫలమయ్యారు."

- సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు

'తీవ్ర పరిణామాలు తప్పవు..'

సమావేశంలో.. సోనియా వ్యాఖ్యలకు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ మద్దతు పలికారు. సరిహద్దు సంక్షోభం ఇలాగే కొనసాగితే దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

గత నెల నుంచి భారత్​-చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన.. ఈ నెల 15న తీవ్ర రూపం దాల్చింది. గల్వాన్​ లోయలో చైనీయులు దుస్సాహసానికి పాల్పడి 20మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు.

ఇదీ చూడండి:- 'సరిహద్దుల్లో ఒక్క బుల్లెట్​ పేలినా.. ఇక యుద్ధమే'

Last Updated : Jun 23, 2020, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.