పార్టీశ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు తక్షణం కాంగ్రెస్ పార్టీ నాయకత్వ ఎన్నికలు నిర్వహించాలని ఎంపీ శశిథరూర్ పునరుద్ఘాటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలికి (సీడబ్ల్యూసీ) సూచించారు. దిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను పార్టీ ముఖ్య నేతలు సహా దేశవ్యాప్తంగా ఉన్న నాయకులూ సమర్థిస్తున్నారని శశిథరూర్ పేర్కొన్నారు.
రాజ్యసభలోని సీనియర్ ఎంపీలు, మాజీ సీఎంలు, ప్రస్తుత ముఖ్యమంత్రులు అందరూ ఒకతాటిపైకి వచ్చి పార్టీకి పునరుజ్జీవం పోయాల్సిన సమయం ఆసన్నమైందని సందీప్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యలతో ప్రచురితమైన కథనాన్ని శశిథరూర్ ట్విట్టర్‌లో ట్యాగ్ చేశారు.
శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కోసం వెంటనే ఎన్నికలు నిర్వహించాలని శశి థరూర్... సీడబ్ల్యూసీకి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: నిర్భయ: దిల్లీ కోర్టుకు వినయ్.. వైద్యం కోసం వినతి