ETV Bharat / bharat

సీడబ్ల్యూసీ సమావేశం 12న

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) విస్తృత స్థాయి సమావేశం తేదీ ఖరారైంది. మార్చి 12న గుజరాత్​లోని అహ్మదాబాద్​ వేదికగా జరగనుంది.

సీడబ్ల్యూసీ సమావేశం 12న
author img

By

Published : Mar 6, 2019, 1:42 PM IST

కాంగ్రెస్​ పార్టీ అతిపెద్ద కార్యవర్గ సమావేశం సీడబ్ల్యూసీ(కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ). ఫిబ్రవరి 28న జరగాల్సిన మీటింగ్​ను భారత్​-పాక్​ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వాయిదా వేశారు. అనంతరం ఈనెల 12న గుజరాత్​లోని అహ్మదాబాద్​లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

నూతనంగా కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంకగాంధీ తన తొలి సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

లోక్​సభ ఎన్నికలే లక్ష్యంగా....

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రచించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహాలు, ప్రచారానికి రోడ్​మ్యాప్​ ఖరారు చేసే అవకాశముంది.

ప్రస్తుత దేశ రాజకీయాలపైనా కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు.

58 ఏళ్ల తర్వాత...

58 ఏళ్ల అనంతరం గుజరాత్​లో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. 1961లో చివరిసారిగా రాష్ట్రంలోని భావ్​నగర్​లో జరిగింది. దాదాపు 3 దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉంది కాంగ్రెస్​. మహాత్మా గాంధీ 150 వ జయంతి వేడుకల సందర్భంగా సీడబ్ల్యూసీ సమావేశం ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.