మొహర్రం సమీపిస్తున్న తరుణంలో కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో తిరిగి ఆంక్షలను విధించారు అధికారులు. పండగ సందర్భంగా జరిగే ఊరేగింపుల్లో జనం ఎక్కువ సంఖ్యలో గుమిగూడతారని, ఉగ్రకార్యకలాపాలకు పాల్పడేందుకు అవకాశం ఉందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీనగర్ లాల్ చౌక్ చుట్టు పక్కల ప్రాంతాలను పూర్తిగా మూసేశారు. పలు రహదారుల్లో ఇనుపకంచెలు ఏర్పాటు చేశారు. వైద్య సంబంధిత అత్యవసరం ఉన్న వాళ్లను మాత్రమే బారికేడ్లు దాటి అవతలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. మిగతా వారిని ఎక్కడికక్కడ నియంత్రిస్తున్నారు.
జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసి నేటికి 35 రోజులు. అప్పటి నుంచి ఆంక్షల మధ్య కశ్మీర్లో జనజీవనం సాగుతోంది.
ఇదీ చూడండి: అభివృద్ధికి మారుపేరు మోదీ 2.0: అమిత్షా