ETV Bharat / bharat

'న్యూఇయర్ వేడుకలపై నిఘా'

author img

By

Published : Dec 30, 2020, 1:49 PM IST

న్యూఇయర్ సంబరాలపై నిఘా ఉంచాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ప్రజలు గుమిగూడకుండా నివారించాలని పేర్కొంది. కరోనాను దృష్టిలో ఉంచుకొని సూపర్ స్ప్రెడర్​గా మారే అవకాశం ఉన్న కార్యక్రమాలపై పర్యవేక్షణ పెంచాలని సూచించింది.

Curb crowding on New Year, check superspreader events: Centre
'న్యూఇయర్ కార్యక్రమాలపై కన్నేసి ఉంచండి'

నూతన సంవత్సర సంబరాలపై ప్రభుత్వాలు పటిష్ఠ నిఘా ఉంచాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సూపర్ స్ప్రెడర్​గా మారే అవకాశం ఉన్న కార్యక్రమాలపై కన్నేసి ఉంచాలని స్పష్టం చేసింది. ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా చూడాలని పేర్కొంది.

ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కొత్త సంవత్సరంతో పాటు ఈ సీజన్​లో జరిగే ఇతర కార్యక్రమాలపైనా ప్రభుత్వాలు పర్యవేక్షణ పెంచాలని సూచించారు.

రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి కరోనా నియంత్రణ కోసం స్థానికంగా ఆంక్షలు విధించుకోవచ్చని తెలిపారు భూషణ్. అయితే కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ ఆంక్షలు ఉండాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: లెక్కలు తారుమారు- భాజపా బేజారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.