ETV Bharat / bharat

ఆపరేషన్​ కరోనా: మరో డ్రగ్​పై క్లినికల్ ట్రయల్స్

కొవిడ్​ రోగులకు చికిత్స అందించే యుమిఫెనొవిర్​ క్లినికల్​ ట్రయల్స్​కు అనుమతి లభించింది. లఖ్​నవూలోని ఓ విశ్వవిద్యాలయం సహా.. మరికొన్ని వైద్యశాలల్లో దీనిపై మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించేందుకు కేంద్ర ఔషధ పరిశోధనా సంస్థ(సీడీఆర్​ఐ) సమ్మతించింది.

author img

By

Published : Jun 19, 2020, 5:47 PM IST

CSIR gets nod for Phase III trial of antiviral drug Umifenovir
యాంటీ వైరల్​ ఔషధ క్లినికల్​ ట్రయల్స్​కు 'సీడీఆర్​ఐ' ఓకే!

కరోనా రోగుల చికిత్సలో యాంటీ వైరల్‌ ఔషధం యుమిఫెనొవిర్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు కేంద్ర ఔషధ పరిశోధనా సంస్థ(సీడీఆర్​ఐ) అనుమతినిచ్చింది. లఖ్‌నవూలోని కింగ్‌ జార్జ్‌ వైద్య విశ్వవిద్యాలయం సహా.. మరికొన్ని ఆస్పత్రుల్లో దీనిపై మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభంకానున్నాయి.

చైనా, రష్యాలో అలా..

యువిఫెనొవిర్​ ఔషధం.. మానవ కణాల్లో వైరస్ ప్రవేశించకుండా నివారించడం సహా రోగ నిరోధక శక్తినీ పెంచుతుంది. చైనా, రష్యాలో లభ్యమయ్యే ఈ ఔషధాన్ని ప్రస్తుతం శీతల జ్వరానికి ఉపయోగిస్తున్నారు. కరోనా రోగులకు కూడా ఇది మెరుగైన ఫలితాలు ఇస్తుండటం వల్ల దీనికి మరింత ప్రాముఖ్యం పెరిగింది. భారత్‌లోని కరోనా రోగులపై ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకునేందుకు సీఎస్​ఐర్​- సీడీఆర్​ఐ క్లినికల్‌ ట్రయల్స్ ప్రారంభించాయి.

ఇదీ చదవండి: ఆ నీటిని తాగండి.. కరోనాను తరిమికొట్టండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.