ETV Bharat / bharat

భార్యను కాల్చి చంపి సీఆర్​పీఎఫ్​​ జవాన్​ ఆత్మహత్య - CRPF news

జమ్ములో ఓ సీఆర్​పీఎఫ్​ జవాను భార్యను కాల్చి చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురిని చంపాలని కాల్పులు జరపగా భార్య చెల్లెలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై శాఖాపరమైన దర్యాప్తు చేపట్టింది సీఆర్​పీఎఫ్​.

CRPF jawan kills wife before ending his own life in Jammu
సీఆర్​పీఎఫ్​​ జవాను ఆత్మహత్య
author img

By

Published : Sep 13, 2020, 11:46 AM IST

జమ్ములో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను కాల్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడో సీఆర్​పీఎఫ్​ జవాను. ఈ ఘటనలో అతని భార్య చెల్లెలికి తీవ్రగాయాలయ్యాయి.

ఇదీ జరిగింది..

జమ్ము హెడ్​క్వార్టర్​లో విధులు నిర్వర్తిస్తున్నాడు సీఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​ మదన్ సింగ్​ (38). కొద్ది రోజులుగా అతని భార్య దీప్తి రాణి (35)తో గొడవలు జరుగుతున్నాయి. నిన్న నగర శివారు ఘరోటా ప్రాంతం రాజోర్​లోని తన చెల్లి ఇంటికి దీప్తి వెళ్లింది. భార్యపై కోపం పెంచుకున్న మదన్​.. శనివారం రాత్రి సర్వీసు రివాల్వర్​ తీసుకుని క్యాంపు నుంచి నేరుగా మరదలి ఇంటికి చేరుకున్నాడు.

రాత్రి 10.30 గంటల సమయంలో భార్య తలుపు తీసే క్రమంలోనే కాల్పులకు పాల్పడ్డాడు. దీప్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తన కూతురిని చంపాలని కాల్పులు చేయగా అక్కడి నుంచి తను పారిపోయింది. ఈ ఘటనలో దీప్తి చెల్లికి తూటాలు తగిలినట్లు అధికారులు తెలిపారు. అయితే.. చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు పోలీసులు.

భార్య మృతదేహం వద్దే సింగ్​ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. శవపరీక్ష కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన మహిళను చికిత్స చేస్తున్నారు. ఈ ఘటనపై శాఖాపరమైన దర్యాప్తు చేపట్టింది సీఆర్​పీఎఫ్​.

ఇదీ చూడండి: దిల్లీ అల్లర్ల ఛార్జిషీట్- ఏచూరిపై అభియోగాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.