ETV Bharat / bharat

దేశ భద్రతలో సీఆర్​పీఎఫ్​ది కీలక పాత్ర: మోదీ

దేశ అంతర్గత భద్రత కోసం సీఆర్​పీఎఫ్ ముందుండి కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. సీఆర్​పీఎఫ్ 82వ రైజింగ్ డే సందర్భంగా... కేంద్ర రిజర్వ్ పోలీసు దళ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

author img

By

Published : Jul 27, 2020, 11:29 AM IST

CRPF is at forefront of keeping our nation safe: PM Modi
'అంకిత భావానికి, నిబద్ధతకు సీఆర్​పీఎఫ్ పర్యాయపదం'

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 82వ రైజింగ్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సీఆర్​పీఎఫ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు సీఆర్​పీఎఫ్ జవాన్లు ముందుండి పోరాడుతున్నారని ట్విట్టర్ వేదికగా కొనియాడారు.

CRPF is at forefront of keeping our nation safe: PM Modi
ముందుండి దేశాన్ని రక్షిస్తున్న సీఆర్​పీఎఫ్​

"సీఆర్​పీఎఫ్ 82వ రైజింగ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సీఆర్​పీఎఫ్ ముందు వరసలో ఉండి మన దేశాన్ని సురక్షితంగా కాపాడుతోంది. మీ శక్తి, ధైర్యం, వృత్తి నైపుణ్యం దేశప్రజల మన్ననలను అందుకుంటున్నాయి. మున్ముందు సీఆర్​పీఎఫ్ మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతుంది."

- ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​

నిబద్ధతకు పర్యాయపదం

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా సీఆర్​పీఎఫ్ జవాన్లకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ భద్రత పట్ల అంకితభావం, విధి నిర్వహణ, నిబద్ధతలకు సీఆర్​పీఎఫ్ పర్యాయపదమని ఆయన అభివర్ణించారు.

అంకిత భావానికి, నిబద్ధతకు సీఆర్​పీఎఫ్ పర్యాయపదం

ఘన చరిత్ర

1939 జులై 27న 'క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీసు' పేరుతో సీఆర్​పీఎఫ్ ప్రారంభమైంది. 1949 డిసెంబర్ 28న సీఆర్​పీఎఫ్ చట్టం ప్రకారం, కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సీఆర్​పీఎఫ్​)గా మారింది. దేశ అంతర్గత భద్రత కోసం సీఆర్​పీఎఫ్ అనితరసాధ్యమైన రీతిలో కృషి చేస్తోంది.

ఇదీ చూడండి: రాష్ట్రపతికి పదో తరగతి కుర్రాడు లేఖ.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.