సార్వత్రిక సమరంలో నెగ్గిన పార్లమెంట్ సభ్యుల్లో 475మంది కోటీశ్వరులేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) తెలిపింది. గెలిచిన 542 మంది పార్లమెంటు సభ్యుల్లో 539 మంది ప్రమాణపత్రాలను పరిశీలించి ఈ జాబితా విడుదల చేసింది ఏడీఆర్. మిగతా ముగ్గురు సభ్యుల ప్రమాణపత్రాలను రాబట్టేందుకు వీలు కాలేదని పేర్కొంది.
పార్టీ | మొత్తం సభ్యులు | కోటీశ్వరులైన ఎంపీల సంఖ్య | శాతం |
భాజపా | 303 | 265 | 88 |
శివసేన | 18 | 18 | 100 |
కాంగ్రెస్ | 51 | 43 | 93 |
డీఎంకే | 23 | 20 | 91 |
టీఎంసీ | 22 | 19 | 86 |
వైఎస్సార్సీపీ | 22 | 22 | 100 |
ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న ఎంపీలు ముగ్గురు కాంగ్రెస్‌కు చెందిన వారే. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు, ఛింద్వాడాకు ప్రాతినిధ్యం వహిస్తున్న నకుల్‌నాథ్ రూ.660 కోట్లతో ప్రథమ స్థానంలో నిలిచారు. తమిళనాడు కన్యాకుమారి ఎంపీ వసంత్‌కుమార్ రూ. 417 కోట్లతో రెండోస్థానం, కర్ణాటక లోని బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేశ్ రూ. 338 కోట్లతో మూడోస్థానంలో ఉన్నారు.
నూతన ఎంపీల సరాసరి ఆస్తి రూ. 20.93 కోట్లుగా లెక్కతేలింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి ఉన్న ఎంపీలు 266మంది.
2009 ఎన్నికల్లో గెలిచినవారిలో 315 మంది ఎంపీలు(58 శాతం), 2014లో గెలిచిన ఎంపీల్లో 443(82)శాతం కోటీశ్వరులు. తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీల్లో కోటీశ్వరులు 87 శాతం మంది.
ఇదీ చూడండి: నేడు సిక్కిం ముఖ్యమంత్రిగా గోలే ప్రమాణం