దేశంలో కొవిడ్-19 కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కొత్తగా 78,512 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కరోనాతో మరో 971 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 36 లక్షల మార్కు దాటింది. మరోవైపు మరణాల్లోనూ మెక్సికోను దాటి మూడో స్థానానికి చేరింది భారత్.

రికవరీలో మరింత పురోగతి
పెరుగుతున్న కొవిడ్ కేసులకు అనుగుణంగా.. కోలుకున్న వారి సంఖ్యా గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. దేశవ్యాప్త రికవరీ రేటు 76.63 శాతంగా ఉంది. మరణాల రేటు కూడా మరింత ఊరట కలిగిస్తూ 1.78 శాతానికి తగ్గింది.
ఇదీ చదవండి: ఒక్కరోజే 10.5 లక్షల కరోనా పరీక్షలు