ETV Bharat / bharat

మాస్కు​ ఎవరు వాడాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా మాస్కుల కొరత ఏర్పడింది. అవసరం లేని వారు కూడా మాస్కులను కొనుగోలు చేస్తుండటం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మాస్కులు ఎవరు ఉపయోగించాలి.. ఎలా వాడాలన్న విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని సూచనలు చేసింది. అవేంటో చూద్దాం..

COVID-19: When to use a mask and precautions to take
మాస్కులు ఎవరు వాడాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
author img

By

Published : Mar 30, 2020, 6:20 PM IST

కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా వైద్య పరికరాలకు డిమాండ్ అమాంతం పెరిగింది. మరీ ముఖ్యంగా మాస్కుల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఫలితంగా మాస్కుల కొరత ఏర్పడింది. దీనివల్ల అవసరమైనవారికి మాస్కులు లభించడం లేదు.

ముఖ్యంగా కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులకూ ఈ పరికరాలు అందటం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మాస్కులు ఎవరు ధరించాలన్న విషయంపై కొన్ని సూచనలు చేసింది.

COVID-19: When to use a mask and precautions to take
మాస్కులు ఎవరు వాడాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
  • కరోనా సోకిన వ్యక్తికి కాని, లేదా అనుమానితుడిని మీరు పర్యవేక్షిస్తున్నట్లయితే మాస్కు అవసరం.
  • జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు మాస్కును వాడాలి.
  • వైద్య సిబ్బంది అయితే.. అది కూడా శ్వాసకోస సంబంధ వ్యాధుల విభాగంలో పనిచేస్తున్నప్పుడు మాస్కు తప్పనిసరిగా ఉపయోగించాలి.

అయితే మాస్కులను వినియోగించేప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

1. మాస్కును ఉపయోగించే ముందు మీ చేతులను శుభ్రం చేసుకోవాలి, సబ్బు లేదా ఆల్కాహాల్ ఆధారిత శానిటైజర్​ను ఉపయోగించి కడుక్కోవాలి.

2. ముక్కు, నోరు పూర్తిగా కప్పేయాలి. ఎలాంటి ఖాళీ లేకుండా చూసుకోవాలి.

3. సర్జికల్ మాస్కు వాడుతున్నట్లయితే.. ముడుతలను సరిగా విప్పి అవి కిందివైపు ఉండే విధంగా చూసుకోవాలి.

4. ఒకసారి వాడిపడేసే మాస్కులను మరోసారి వినియోగించకూడదు.

5. మాస్కు తడిసినట్లయితే వెంటనే తీసేయాలి.

6. మాస్కును మీరు పెట్టుకున్నప్పుడు దాన్ని ముట్టుకోవద్దు. ఒకవేళ ముట్టుకున్నా వెంటనే సబ్బు, శానిటైజర్ తో కడుక్కోవాలి.

7. మాస్కును తొలగించేటప్పుడు దాని ఉపరితలాన్ని తాకకూడదు. దానికి ఉన్న దారాలతోనే విప్పాలి.

8. మాస్కును మెడకు వేలాడనీయొద్దు.

9. మాస్కులను తీసేసిన తర్వాత ఎక్కడపడితే అక్కడ పడేయకూడదు.

10. మాస్కును తొలగించిన తర్వాత మూసిఉంచిన చెత్తడబ్బాలో పడేయాలి. తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేస్తే మాస్కులు అవసరం లేదు..

మాస్కులను దుర్వినియోగం చేయొద్దు. మాస్కులను అందరూ వాడుతున్నారని మనం వాడాల్సిన అవసరం లేదు. అవి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు పనికివస్తాయి. అందువల్ల అవసరం లేకుండా మాస్కులను కొనవద్దు. వైరస్ సోకే అవకాశం ఉన్నవారికి మాస్కులు లభించేలా చూద్దాం.

మాస్కుల వాడకం కన్నా శుభ్రత పాటిస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్రద్ధ వహిస్తే కరోనా వైరస్ రాకుండా అడ్డుకోవచ్చు. సామాజిక దూరం పాటించండి. తరచుగా చేతులను శుభ్రం చేసుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లకండి.

ఇదీ చూడండి: 'కరోనా లక్షణాలున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.