ETV Bharat / bharat

మహారాష్ట్రలో 22 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో ఇవాళ మరో 1,278 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం బాధితుల సంఖ్య 22,000 దాటింది. తమిళనాడులో 669, గుజరాత్​లో 398, దిల్లీలో 381, మధ్యప్రదేశ్​లో 157, బంగాల్​లో 113 మందికి నేడు కొత్తగా వైరస్​ సోకింది.

COVID-19: TN breaches 7,000 mark, trend of high numbers continue
మహారాష్ట్రలో 22 వేలు దాటిన కరోనా కేసులు
author img

By

Published : May 10, 2020, 10:12 PM IST

దేశంలో రోజురోజుకూ కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. కరోనా కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో వైరస్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో గుజరాత్, దిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు ఉన్నాయి.

మహారాష్ట్రలో 22 వేలు దాటిన కేసులు

మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 1,278 మందికి వైరస్​ సోకింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 22,171కి చేరినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. ఇవాళ మరో 53 మంది మృతి చెందగా... మొత్తం మరణాలు 779కి పెరిగాయి. ఇప్పటి వరకు 3,800 మంది వైరస్​ నుంచి కోలుకుని డిశ్చార్జి​ అయ్యారు.

తమిళనాడులో 7 వేలు దాటిన కేసులు

తమిళనాడులో గడిచిన 24 గంటల్లో 669 మందికి వైరస్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వీరిలో 412 మంది పురుషులు కాగా.. 257 మంది మహిళలు ఉన్నారు. మొత్తం బాధితుల సంఖ్య 7,204కు పెరిగినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. నేడు మరో నలుగురు మృతి చెందగా... మొత్తంగా 47 మంది మహమ్మారికి బలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,959 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.

గుజరాత్​లో మరో 398మందికి..

గుజరాత్​లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 398 మందికి వైరస్ సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 8,195కు చేరింది. తాజాగా 21 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్​కు బలయిన వారి సంఖ్య 493కు పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 454 మంది డిశ్చార్జి కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా 2,545 మందిలో వైరస్ నయమైంది.

దిల్లీలో కొత్తగా 381 మందికి

దేశ రాజధాని దిల్లీలో కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో 381 మందికి వైరస్​ సోకినట్లు దిల్లీ అధికారులు తెలిపారు. కొత్తగా ఐదుగురు మరణించగా.. వైరస్ మృతుల సంఖ్య 68కి చేరుకుంది. ఇప్పటి వరకు అక్కడ 6,923 మంది మహమ్మారి బారినపడగా... 2,069 మంది కోలుకున్నారు.

మధ్యప్రదేశ్​లో 3 వేలకు పైగా..

మధ్యప్రదేశ్​లో నేడు కొత్తగా 157 మంది మహమ్మారి బారినపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 3,614 మందికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. వీరిలో 1,676 మంది రికవరీ అయినట్లు తెలిపారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 215 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు.

బంగాల్​ మరో 14 మంది మృతి

బంగాల్​లో ఒక్కరోజు వ్యవధిలో 14 మంది వైరస్​కు బలయ్యారు. ఆ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 113కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 153 కేసులు నమోదు కాగా... బాధితుల సంఖ్య 1,939కి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 1,337 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పంజాబ్​లో కొత్తగా 61 కేసులు

పంజాబ్​​లో నేడు మరో 61 వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 1,823 మంది ప్రాణాంతక వైరస్​ బారిన పడినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,626 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

కర్ణాటకలో 794 మందికి వైరస్

కర్ణాటకలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ మరో 54 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 848 మందికి వైరస్​ సోకినట్లు వెల్లడించారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 31 మంది మృతి చెందగా, 422 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. మరో 394 మంది చికిత్స పొందుతున్నారు.

రాజస్థాన్​​లో వందకు పైగా మృతులు

రాజస్థాన్​లో వైరస్​ కారణంగా ఇప్పటి వరకు 107 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. కొత్తగా 45 మందికి వైరస్ సోకినట్లు చెప్పారు. మొత్తంగా రాష్ట్రంలో 3,753 మంది కరోనా​ బారినపడ్డారు. వీరిలో జైపూర్​ నుంచి 1,206 మంది ఉన్నట్లు సమాచారం.

  • బిహార్​లో గడిచిన 24 గంటల్లో 34 మందికి వైరస్​ సోకింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 629 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు. 318 మందికి వైరస్ నయమైంది.
  • హరియాణాలో తాజాగా 28 మందికి వైరస్ సోకింది. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 703కు చేరింది. వీరిలో 393 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా... 300 మంది కోలుకున్నారు. పది మంది మృతి చెందారు.
  • జమ్ముకశ్మీర్​లో మరో 25 మందికి వైరస్​ సోకగా మొత్తంగా 861 మంది వైరస్ బారినపడినట్లు సమాచారం. వీరిలో కశ్మీర్ లోయలోనే 790 మంది బాధితులు ఉన్నారు. ప్రస్తుతం 469 మంది చికిత్స పొందుతున్నారు. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఝార్ఖండ్​లో ఇవాళ ఒక్కరోజే 21 మందికి వైరస్​ సోకినట్లు గుర్తించారు అధికారులు. ఇప్పటి వరకు 153 మంది మహమ్మారి బారిన పడ్డారు.
  • ఒడిశాలో కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం 15 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా 377 మంది మహమ్మారి బారిన పడ్డారు. ప్రస్తుతం 306 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ముగ్గురు మృతి చెందారు.
  • కేరళలో ఇవాళ మరో ఏడుగురికి కరోనా సోకినట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. మొత్తంగా 512 మందికి వైరస్​ సోకగా.. వీరిలో 20 మంది మాత్రమే చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.
  • చండీగఢ్​లో ఇవాళ నలుగురికి కరోనా ఉన్నట్లు తేలింది. వీరితో కలిపి ఇప్పటి వరకు 173 మంది వైరస్​ బారిన పడ్డారు.
  • హిమాచల్​ప్రదేశ్​లో ఇవాళ ముగ్గురికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. ఇప్పటి వరకు 56 వైరస్ కేసులు నమోదు కాగా.. 35 మంది కోలుకున్నారు. ముగ్గురు వైరస్​కు బలయ్యారు.
  • ఉత్తరప్రదేశ్​లో మొత్తం 1,884 యాక్టివ్​ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 1,504 మంది రికవరీ అయినట్లు వెల్లడించారు.
  • ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీ జిల్లాలో ఇవాళ తొలి కేసు నిర్ధరణ అయింది. దీంతో అక్కడ మొత్తం బాధితుల సంఖ్య 68 ఎగబాకింది. వీరిలో 46 మంది కోలుకోగా.. ఒకరు మృతి చెందారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.