కరోనా బాధితులు, ఆరోగ్య సిబ్బంది క్షేమం కోసం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఏకకాల ప్రార్థనలు చేస్తున్నారు. అందరం కలిసి సాధించగలమంటూ సందేశాన్ని ఇస్తున్నారు. ఈ ప్రార్థనలను భారత యోగా అసోసియేషన్ (ఐవైఏ) సోమవారం ప్రారంభించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలు లేదా సాయంత్రం 6 గంటలకు విద్యార్థులు ఒక సమయాన్ని ఎంచుకుని ప్రార్థనలు చేస్తున్నారు. టుగెదర్ వి కెన్, సింక్రనైజ్డ్ గ్లోబల్ ప్రేయర్స్ అనే హ్యాష్ ట్యాగ్ లతో వీడియోలు షేర్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా తరహాలో..
ఆస్ట్రేలియా కార్చిచ్చు సమయంలోనూ అక్కడి విద్యార్థులు ఇలాంటి ప్రార్థనలను నిర్వహించారు. భారత్ లోనూ అనేక విశ్వవిద్యాలయాలతోపాటు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ).. విద్యార్థులకు పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించింది.
"ఈ ప్రార్థన భ్రమరి(5 సెకన్లు శ్వాస పీల్చి 10 సెకన్ల పాటు వదిలేయటం)తో ప్రారంభిస్తారు. తర్వాత చేతులు పైకెత్తుతూ తొమ్మిదిసార్లు.. కలిసి పోరాడి కరోనాపై విజయం సాధిస్తాం అంటూ నినదిస్తారు. చివరిగా చప్పట్లు కొడుతూ శాంతి, శాంతి, శాంతితో ప్రార్థన ముగుస్తుంది. "
- నాగేంద్ర, హెచ్ఆర్, ఐవైఏ
ఇదీ చూడండి: సీఎంలతో శనివారం మోదీ భేటీ- లాక్డౌన్పై నిర్ణయం
!