దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ దేశ వ్యాపంగా 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించడాన్ని స్వాగతించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించనున్నట్లు వెల్లడించారు.
"కరోనా వైరస్ లక్షలాది మంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా సమాజంలోని దుర్భర జీవితాన్ని గడుపుతున్న వారిని ఆర్థికంగా కుంగదిసింది. మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశ ప్రజలందరూ కలిసి యుద్ధం చేయవలసిన తరుణమిది."
-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
లాక్డౌన్ అమలుపై ప్రధానికి కొన్ని సలహాలు, సూచనలు చేస్తూ లేఖ రాశారు సోనియా. అందులోని కీలకాంశాలు:
- వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి అవసరమైన ఎన్- 95 మాస్క్‌లు, ఇతర వైద్య పరికరాలను త్వరగా అందించండి.
- మార్చి 1 నుంచి ఆరు నెలలపాటు వీరికి రిస్క్ అలవెన్స్ ముందుగానే చెల్లించాలి.
- ప్రస్తుతం దేశంలో మాస్క్‌ల కొరత ఉన్నందున వెంటనే ఉత్పత్తిని ప్రారంభించే దిశగా అడుగులు వేయాలి.
- రైతులకు, వేతన జీవులకు ఆరు నెలలపాటు వారి రుణ వసూళ్లను వాయిదా వేయాలి.