ETV Bharat / bharat

ఆ ప్రాంతంలో గబ్బిలాలకు పూజ.. ఎందుకంటే? - కరోనా వైరస్​ గబ్బిలాలు

బంగాల్​లోని భాసర్దాబి గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. అక్కడ 1000కిపైగా గబ్బిలాలకు గ్రామస్థులు పూజ చేశారు. కరోనా వైరస్​ నేపథ్యంలో తమను ఏమీ చేయవద్దని ప్రార్థించారు.

covid-19-scare-prompts-villagers-to-worship-bats
కరోనా ఎఫెక్ట్​: ఆ ప్రాంతంలో గబ్బిలాలకు పూజ
author img

By

Published : Apr 10, 2020, 4:13 PM IST

Updated : Apr 10, 2020, 8:20 PM IST

ఆ ప్రాంతంలో గబ్బిలాలకు పూజ

"కరోనా వైరస్​ గబ్బిలాల నుంచే వచ్చింది.." ఈ మాటలో నిజం ఎంతో ఇంకా తెలియనప్పటికీ.. గబ్బిలాలను చూస్తుంటే మనుషులు భయపడిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్​ సృష్టిస్తున్న బీభత్సం అలాంటిది మరి. కొందరు గబ్బిలాలకు దూరంగా ఉంటుంటే.. మరికొందరు వాటికి పూజలు చేస్తున్నారు. తమను ఏం చేయవద్దని ప్రార్థిస్తున్నారు.

బంగాల్​లోని భాసర్దాబి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా గబ్బిలాలతో కలిసి సావాసం చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఆ ప్రాంతంలో ఉన్న వెదురు పొదలో 1000కిపైగా గబ్బిలాలు నివాసముంటున్నాయి. వీటిని చూసేందుకు చుట్టుపక్క గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చేవారు.

కానీ కరోనా వైరస్​ వార్తతో అన్నీ మారిపోయాయి. గబ్బిలాల నుంచే వైరస్​ సోకిందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చూసిన గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమను ఏమీ చేయవద్దంటూ వాటికి పూజలు నిర్వహించారు.

"మా గ్రామానికి సమీపంలో శిలిగుడి ఉంది. అక్కడ నిఫా వైరస్​ విజృంభించినప్పుడూ మేం భయపడలేదు. ఎన్నో రకాల వైరస్​కు గబ్బిలాలు ఆశ్రయమిస్తాయని కూడా మాకు చెప్పారు. అయినా మా గ్రామంలోని గబ్బిలాలకు మేం బెదరలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. కరోనాకు మందు లేదు. ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. అందుకే పూజ నిర్వహించాలని గ్రామస్థులు నిశ్చయించారు."

--- స్థానికుడు.

ఇదీ చూడండి:- కరోనాపై ఏడేళ్ల క్రితమే కేంద్రానికి కాగ్​ హెచ్చరిక!

Last Updated : Apr 10, 2020, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.