దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రైల్వే శాఖ తన వంతుగా నివారణ చర్యలు చేపట్టింది. అనవసర ప్రయాణాలను తగ్గించటానికి కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, వికలాంగులకు, రోగులకు తప్ప మిగిలిన వారికి ప్రభుత్వం అందించే రాయితీతో కూడిన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది రైల్వే శాఖ.
"రోగులు, విద్యార్థులు, వికలాంగులకు తప్ప మిగిలిన వారికి రాయితీ టికెట్లను మార్చి 20 నుంచి రద్దు చేస్తున్నాం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయి."
-రైల్వే శాఖ ప్రకటన.
రైల్వే శాఖలో ఇచ్చే మొత్తం 53 కేటగిరీల్లో ప్రస్తుతం కేవలం 15 కేటగిరీలకు మాత్రమే రాయితీలు వర్తిస్తాయని తెలిపింది కేంద్రం. వయో వృద్ధులు అనవసర ప్రయాణాలు చేయకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
60 శాతం టికెట్లు రద్దు...
కరోనా వైరస్ కారణంగా మార్చి నెలలో 60 శాతంపైగా టికెట్లు రద్దయ్యాయని రైల్వే సీనియర్ అధికారులు పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలిపారు.
ఇదీ చూడండి:స్పైస్‌జెట్ సర్వీస్‌లు రద్దు- కరోనానే కారణం