దేశంలో కరోనా కేసులతో పాటు రికవరీ సంఖ్యలోనూ రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 63,631మంది కరోనాను జయించి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవరీ రేటు 74.69 శాతానికి చేరింది. మరోవైపు మరణాల రేటు 1.87కు పడిపోయింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం ప్రకటించింది.
దేశంలో పరీక్ష సామర్థ్యం కూడా రోజురోజుకు భారీగా పెరుగుతోంది. శుక్రవారం నాడు మొత్తం 10,23,836మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 3.4 కోట్లమందిపై పరీక్షలు జరిపారు.
విస్తృతంగా పరీక్షలు నిర్వహించి కేసులును ప్రారంభ దశలోనే గుర్తించడం, సమగ్ర నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్, బాధితులకు అందించే క్లినికల్ చికిత్స వల్లే రికవరీ రేటు పెరుగుతోందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి:- 'సైకత గణేశా' కరోనాతో పోరాడే శక్తినియ్యవయ్యా..