ETV Bharat / bharat

కవలలకు జన్మనిచ్చిన కరోనా పేషెంట్.. అంతలోనే!

కరోనా వైరస్​ సోకిన ఓ గర్భిణి కవలలకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు ఓ చిన్నారి మరణించగా.. మరొకరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రాణాలతో ఉన్న చిన్నారికి వారం తర్వాత కరోనా పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు.

odisha
ఒడిశా ట్విన్స్
author img

By

Published : May 14, 2020, 6:45 AM IST

కరోనా సోకిన 32 ఏళ్ల మహిళ ఒడిశా బెర్హంపుర్​లోని ఎంకేసీజీ ప్రభుత్వ ఆస్పత్రిలో కవలలకు జన్మనిచ్చింది. ఇందులో ఒక శిశువు చనిపోగా.. మరో చిన్నారి ప్రాణాలతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బరువు తక్కువగా ఉన్న కారణంగానే శిశువు మరణించినట్లు స్పష్టం చేశారు. అయితే తల్లి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.

ప్రాణాలతో ఉన్న చిన్నారికి వారం రోజుల తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యులు చెప్పారు. వైరస్​ సోకినందున మహిళను కొవిడ్ ఆస్పత్రికి తిరిగి పంపించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డలను వేర్వేరు క్యాబిన్లలో ఉంచినట్లు స్పష్టం చేశారు.

ఇటీవలే గుజరాత్​లోని సూరత్​ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు.. కరోనా సోకినట్లు మే 10న ఎంకేసీజీ మెడికల్ కాలేజీ వైద్యులు నిర్ధరించారు. అనంతరం కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం పురిటి నొప్పులు రావడం వల్ల మహిళను తిరిగి ఎంకేసీజీ ఆస్పత్రిలో చేర్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.