ETV Bharat / bharat

ఈనెల 8న విపక్ష నేతలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్​ - modi news

ఈనెల 8న విపక్ష పార్టీల నేతలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కరోనా వ్యాప్తి, దేశవ్యాప్త లాక్​డౌన్​పై చర్చించనున్నారు.

COVID-19
ఈనెల 8న విపక్ష నేతలతో మోదీ వీడియోకాన్ఫరెన్స్​
author img

By

Published : Apr 4, 2020, 6:55 PM IST

దేశంలో కరోనా వైరస్​ వేగంగా వ్యాప్తి చెందటం, లాక్​డౌన్​ కొనసాగుతున్న తరుణంలో వివిధ పార్టీలకు చెందిన నేతలతో ఈనెల 8న వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు వెల్లడించారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి.

" పార్లమెంట్​ ఉభయసభల్లో ఐదుగురుకన్నా ఎక్కువ మంది సభ్యులు ఉన్న పార్టీల నేతలతో ఈనెల 8న ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ భేటీ కానున్నారు. కొవిడ్​-19, దేశవ్యాప్త లాక్​డౌన్​పై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది."

- ప్రహ్లాద్​ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి.

దేశవ్యాప్త లాక్​డౌన్​ విధించిన తర్వాత విపక్ష పార్టీల నేతలతో ప్రధాని మోదీ సమావేశం కావటం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి: వంట సరకులతో 3 కి.మీ నడిచిన కలెక్టర్​, ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.