రెండో ప్రపంచ యుద్ధం మాదిరిగానే కొవిడ్-19 మహమ్మారి ఒక చారిత్రక మలుపుగా అభివర్ణించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కరోనా అనంతరం పరిస్థితులను స్వీకరించేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలన్నారు. ఇటలీ ప్రధానమంత్రి గియుసేప్ కాంటేతో వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో మోదీ పలు అంశాలపై చర్చించారు.
కరోనాతో ఇటలీలో ప్రాణాలు కోల్పోయిన వారికి భారతీయుల తరఫున సంతాపం తెలిపారు ప్రధాని మోదీ. ప్రపంచంలోని ఇతర దేశాలు కరోనా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆ వైరస్‌తో ఇటలీ ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. దేశం మొత్తాన్ని సంఘటితం చేసి.. చాలా కష్టమైన పరిస్థితిని వేగంగా.. విజయవంతంగా అదుపులోకి తెచ్చారని కితాబిచ్చారు.
కొవిడ్ పరిస్థితి మెరుగుపడిన తర్వాత.. భారత్‌కు ఇటాలియన్ పార్లమెంట్ సభ్యులను స్వాగతిస్తామన్నారు మోదీ.
ఇదీ చూడండి: విద్యార్థుల 'వ్యర్థ కళ'కు ప్రపంచ గుర్తింపు