ETV Bharat / bharat

బ్రిటన్​, స్పెయిన్​లను వెనక్కి నెట్టి నాలుగో స్థానంలోకి.. - corona in India latest update

భారత్​లో కరోనా మహమ్మారి పడగవిప్పుతోంది. కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్యలో నేడు బ్రిటన్‌, స్పెయిన్‌లను దాటేసి నాలుగో స్థానానికి చేరుకోనుంది భారత్‌. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.86 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి.

COVID-19 news from across the nation
బ్రిటన్​, స్పెయిన్​లను వెనక్కి నెట్టి నాలుగో స్థానంలోకి..
author img

By

Published : Jun 12, 2020, 6:25 AM IST

దేశంలో కరోనా కల్లోలానికి తెరపడట్లేదు. రోజురోజుకూ కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో కొవిడ్‌ బాధితులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ శుక్రవారం నాలుగో స్థానానికి చేరుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా ఒక్కరోజులో దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల కేసులు నమోదవడంతో మొత్తం బాధితుల సంఖ్య 2.86 లక్షలు దాటింది.

కేసులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో ప్రస్తుతం భారత్‌ ఆరో స్థానంలో ఉంది. ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న బ్రిటన్‌(2.9 లక్షలు), స్పెయిన్‌(2.89 లక్షలు)లలో రోజువారీ కేసుల పెరుగుదల దాదాపుగా వెయ్యికి దిగువనే ఉంటోంది. ఈ లెక్కన శుక్రవారంతో ఆ రెండింటినీ మన దేశం దాటేయడం లాంఛనమే! దేశవ్యాప్తంగా 24 గంటల్లో 9,996 మందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే. మరణాల్లోనూ దేశంలో కొత్త రికార్డు నమోదయింది. గతంలో ఎన్నడూలేనంత స్థాయిలో ఒక్కరోజులోనే 357 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య ఒక్కరోజులో 300 దాటడం ఇదే ప్రథమం. 24 గంటల్లో 5,823 మంది కోలుకోవడంతో మొత్తంగా రికవరీ రేటు 49.21 శాతానికి చేరుకుంది. దిల్లీలో 1,500కుపైగా కొత్త కేసులొచ్చాయి.

దమణ్‌-దీవ్‌కు పాకిన వైరస్‌

దమణ్‌-దీవ్‌లో తొలిసారి కరోనా కేసులు బయటపడ్డాయి. అక్కడ ఒక్కరోజే ఇద్దరు వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా వ్యాప్తి చెందని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో ఇక లక్షద్వీప్‌ ఒక్కటే మిగిలి ఉన్నట్లయింది. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో క్రియాశీల(యాక్టివ్‌) కేసుల కంటే కోలుకున్నవారే అధికంగా ఉన్నారు.

COVID-19 news from across the nation
భారత్​లో కరోనా కేసుల వివరాలు

మరణాల లెక్కల్లో గందరగోళం

దిల్లీ, తమిళనాడుల్లో కొవిడ్‌ సంబంధిత మరణాల లెక్కల్లో గందరగోళం నెలకొంది. దేశ రాజధానిలో ఇప్పటివరకు 984 మంది కరోనా దెబ్బకు మరణించారని దిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంసీడీ) మాత్రం తమ పరిధిలోని వేర్వేరు డివిజన్లలో ఇప్పటివరకు 2,098 మంది కరోనా మృతులకు అంత్యక్రియలు పూర్తయినట్లు తెలపడం గమనార్హం. మరోవైపు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కలతో పోలిస్తే గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ రిజిస్టర్‌లో 236 కరోనా సంబంధిత మరణాలు అధికంగా నమోదయినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశీలనలో తేలింది. ఈ అంశాన్ని 11 మంది సభ్యుల నిపుణుల బృందం సమీక్షిస్తోంది. తాజా వ్యవహారంపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు. తాము మరణాలనేమీ దాచిపెట్టలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సామాజిక సంక్రమణం లేదని చెప్పారు.

ఇదీ చూడండి: మహారాష్ట్రలో లక్షకు చేరువలో కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.