ETV Bharat / bharat

ట్రెండింగ్​ భారత్​: ట్రంప్​.. మోదీ.. ఓ వలస కూలీ - NEWS MAKER MODI LATEST NEWS

దేశవ్యాప్తంగా కరోనాను అరికట్టేందుకు లాక్​డౌన్​ విధించినప్పటి నుంచి.. వార్తా ముఖ్యాంశాల్లో 42.2 శాతం మహమ్మారి గురించే ప్రసారమైనట్లు ఓ అధ్యయం తెలిపింది. వలస కార్మికుల ఇబ్బందులు అత్యంత ట్రెండింగ్​ వార్తగా నిలవగా.. న్యూస్​మేకర్​ విభాగంలో ట్రంప్​, మోదీ తొలి స్థానాలు కైవసం చేసుకున్నారు.

COVID-19 dominates headlines; Migrant labour crisis most-trending news: Study
ట్రెండింగ్​ భారత్​: ట్రంప్​.. మోదీ.. ఓ వలస కూలీ
author img

By

Published : May 20, 2020, 5:16 AM IST

కరోనా వైరస్​ నియంత్రణలో భాగంగా దేశంలో లాక్​డౌన్ విధించిన తర్వాత.. కొవిడ్​-19పై వార్తలు పెరిగినట్లు అధ్యయనం తెలిపింది. ప్రసారమైన వార్తల్లో 42.2 శాతం ముఖ్యాంశాలు వైరస్​ గురించే వచ్చినట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే దేశ రాజకీయ నాయకుల్లో మోదీ అతిపెద్ద న్యూస్ ​మేకర్​గా స్థానం దక్కించుకున్నట్లు వివరించింది.

కృత్రిమ మేధ సాయంతో..

పీఆర్​ఎమ్​ ఫిన్​కాన్​ టెక్నాలజీ సంస్థ భాగస్వామ్యంతో.. బోటిక్​ బ్రాండ్​- బిల్డింగ్​కు చెందిన ధర్మ మీడియా కన్సల్టెంట్స్​ ఈ అధ్యయనం చేసింది. మార్చి 1 నుంచి మే 10 తేదీల మధ్య ప్రసారమైన 15 ప్రధాన వార్తల్లో.. 75 వేల ముఖ్యాంశాలను కృత్రిమ మేధస్సు ద్వారా విశ్లేషించారు. లాక్​డౌన్​ ముందు కరోనాకు సంబంధించి 24.5 శాతం వార్తలు ప్రసారమవగా.. లాక్​డౌన్ తొలి రెండు దశల్లో అది కాస్తా 42.2 శాతానికి పెరిగినట్లు తెలిపారు. అయితే, మూడో దశ తొలి వారం( మే10 వరకు) వైరస్​ వార్తల సంఖ్య 32 శాతానికి పడిపోయినట్లు వివరించారు.

న్యూస్​ మేకర్​గా మోదీ...

దేశంలోని రాజకీయ నాయకుల్లో అతిపెద్ద న్యూస్​ మేకర్​గా మోదీ నిలిచినట్లు అధ్యయనం తెలిపింది. ఆ తర్వాత స్థానంలో రాహుల్​ గాంధీ, అమిత్​ షా, నిర్మలా సీతారామన్​ ఉన్నట్లు పేర్కొంది.

పలు రంగాల్లో స్థానాలు దక్కించుకున్నవారు....

  • రాష్ట్రస్థాయి నాయకుల్లో (కాంగ్రెస్​ నుంచి భాజపాలో చేరిన నేపథ్యంలో) న్యూస్ మేకర్​గా నిలిచారు జ్యోతిరాదిత్య సింథియా.
  • ఆ తర్వాత దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​, ఉత్తర​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​, మధ్యప్రదేశ్​​ మాజీ సీఎం కమల్​ నాథ్​, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్​ ఠాక్రె, మమతా బెనర్జీ వరుస స్థానాలు కైవసం చేసుకున్నారు.
  • ఇక ప్రధానంగా గూగుల్​, అమెజాన్​, ఫేస్​బుక్​ వెబ్​సైట్లలో కరోనా సంబంధిత వార్తలు అధికంగా ఉన్నట్లు అధ్యయనం తెలిపింది.
  • లిస్టెడ్​ కంపెనీల్లో ఎస్​బ్యాంక్​ తొలిస్థానంలో నిలిచింది.
  • ఫేస్​బుక్​ పెట్టుబడులు పెట్టడం వల్ల జియో.. అన్​లిస్టెడ్​ బ్రాండ్లలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత రియల్​-మి, ఫ్లిప్​కార్ట్​, జొమాటో, స్విగ్గీలు వరుస స్థానాలు దక్కించుకున్నాయి.
  • సినీ తారల్లో ఇటీవలే మరణించిన రిషికపూర్​, ఇర్ఫాన్ ఖాన్​లు ప్రథమ స్థానంలో నిలిచారు. కరీనాకపూర్​, అమితాబ్​ బచ్చన్​, అనుష్క శర్మ తర్వాత ర్యాంక్​ల్లో ఉన్నారు.
  • 2020 టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడటం వల్ల క్రీడల్లో ప్రధాన వార్తగా నిలిచింది. ఆ తర్వాత విరాట్​ కోహ్లీ, ఐపీఎల్​ గురించి ఎక్కువ వార్తలు వచ్చాయి.
  • అంతర్జాతీయ వార్తల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తొలిస్థానం దక్కించుకోగా... ఐక్యరాజ్యసమితి, వాల్ ​స్ట్రీట్​, అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడి స్థానానికి పోటీపడుతున్న జో బిడెన్, ​బోరిస్​ జాన్సన్​( బ్రిటన్​ ప్రధాని) వరుస స్థానాల్లో నిలిచారు.

మే 17 నుంచి మరోసారి లాక్​డౌన్​ను​ పొడిగించింది భారత ప్రభుత్వం. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించే క్రమంలో.. కొన్ని సడలింపులతో లాక్​డౌన్​ను మే 31 వరకు పొడిగిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.