మహారాష్ట్రలో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో ఒక్కరోజు వ్యవధిలో 117 మందికి వైరస్ సోకింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన వారి సంఖ్య 1135కు చేరింది. 24 గంటల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మహారాష్ట్రలో మృతుల సంఖ్య 72కు చేరింది.
దేశవ్యాప్తంగా కొత్తగా 485 మందికి కరోనా సోకింది. కేసుల సంఖ్య 5274కు చేరింది. కొత్తగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మరణాల సంఖ్య 149కి చేరింది. 410 మందికి వ్యాధి నయమైంది.
ఇదీ చూడండి: బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి.. లేదంటే అరెస్టే!