ETV Bharat / bharat

దిల్లీ ఎయిమ్స్​లో 'కొవాగ్జిన్'​​ మానవ ప్రయోగాలకు అనుమతి - AIIMS Ethics Committee

భారత ఫార్మా దిగ్గజం భారత్​ బయోటెక్​, ఐసీఎంఆర్​ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్​ 'కొవాగ్జిన్'​ మానవ ప్రయోగాలు నిర్వహించేందుకు దిల్లీ ఎయిమ్స్​ నైతిక విలువల కమిటీ అనుమతించింది. సోమవారం నుంచి వలంటీర్ల ఎంపిక చేపట్టనున్నారు. ఎయిమ్స్​లో 100 మందికి ఈ టీకా ఇవ్వనున్నారు.

indigenous vaccine Covaxin
దిల్లీ ఎయిమ్స్​లో 'కొవాక్జిన్'​ మానవ ప్రయోగాలకు అనుమతి
author img

By

Published : Jul 19, 2020, 5:31 AM IST

భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​)తో కలిసి ఫార్మా దిగ్గజం భారత్​ బయోటెక్​ రూపొందిస్తున్న కరోనా టీకా 'కొవాగ్జిన్'​ను మనుషులపై ప్రయోగించే ప్రక్రియలో మరో ముందడుగుపడింది. తమ ఆసుపత్రిలో మనుషులపై ప్రయోగాలు నిర్వహించేందుకు దిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్​) నైతిక విలువల కమిటీ సమ్మతించింది.

12 ఆసుపత్రుల ఎంపిక..

ఈ టీకా తొలి, రెండో దశల ప్రయోగాలకు దేశంలోనే ప్రముఖ వైద్య సంస్థ ఎయిమ్స్​ సహా 12 ఆసుపత్రులను ఐసీఎంఆర్​ ఎంపిక చేసింది. మొదటి దశలో మొత్తం 375 మంది వలంటీర్లకు 'కొవాగ్జిన్'​ను ఇవ్వనుండగా వారిలో 100 మంది ఎయిమ్స్​లో ఎంపికయ్యే వారే ఉంటారు.

సోమవారం నుంచి..

వలంటీర్ల పేర్ల నమోదును సోమవారం నుంచి చేపట్టనున్నారు. 18-55 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండి, ఇంత వరకు కరోనా సోకని ఆరోగ్యవంతులైన వ్యక్తులనే వలంటీర్లుగా ఎంపిక చేస్తామని ఎయిమ్స్​ ప్రొఫెసర్​ డా. సంజయ్​రాయ్​ తెలిపారు. ఇప్పటికే స్వచ్ఛందంగా కొందరు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన తర్వాతే టీకా ఇస్తామన్నారు.

హరియాణాలోని రోహ్​తక్​లో పోస్ట్​గ్రాడ్యుయేట్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​లో శుక్రవారం వ్యాక్సిన్​ మానవ ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ముగ్గురు వలంటీర్లకు టీకా ఇచ్చారు.

ఇదీ చూడండి: 'కొవాగ్జిన్'​ మానవ ట్రయల్స్ షురూ..​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.