ETV Bharat / bharat

కేంద్ర మాజీ మంత్రి 'దిలీప్​ రే'కు మూడేళ్ల జైలు

బొగ్గు బ్లాక్​ను కేటాయించడంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన కుంభకోణం కేసులో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్​ రేకు శిక్ష ఖరారు చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఆయనతో పాటు మరో ఇద్దరికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కొద్ది సమయానికే లక్ష రూపాయల పూచీకత్తుపై బెయిల్​ మంజూరైనట్లు సమాచారం.

Union Minister convicted in coal scam
కేంద్ర మాజీ మంత్రికి 3 ఏళ్ల జైలు శిక్ష
author img

By

Published : Oct 26, 2020, 11:31 AM IST

Updated : Oct 26, 2020, 12:35 PM IST

బొగ్గు కుంభకోణంలో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్​ రేకు శిక్ష ఖరారు చేసింది దిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కేసులో దోషులుగా తేలిన మరో ఇద్దరికి కూడా మూడేళ్ల శిక్షను ఖరారు చేసింది.

1999లో ఝార్ఖండ్​లో బొగ్గు బ్లాక్​లను కేటాయించడంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై దర్యాప్తు చేపట్టింది సీబీఐ. వాజ్​పేయీ హయాంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా దిలీప్​ రే పని చేసిన క్రమంలో ఈ కుంభకోణం జరిగింది.

దిలీప్​తో పాటు కుంభకోణం జరిగిన సమయంలో బొగ్గు గనుల మంత్రిత్వ శాఖలో పనిచేసిన ప్రదీప్​ కుమార్​ బెనర్జీ, నిత్యానంద్​ గౌతమ్​, కాస్ట్రోన్​ టెక్నాలజీస్​ లిమిటెడ్​తో పాటు ఆ సంస్థ డైరెక్టర్​ మహేంద్ర కుమార్​ అగర్వాల్​, కాస్ట్రోన్​ మైనింగ్​ లిమిటెడ్​లను దోషులుగా తేల్చుతూ అక్టోబర్​ 6న తీర్పు వెలువరించింది ప్రత్యేక న్యాయస్థానం.

ఆ వెంటనే బెయిల్​..!

దిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దిలీప్​ రేకు మూడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన.. కొద్ది సమయానికి ఆయనకు బెయిల్​ వచ్చింది. రూ.1 లక్ష పూచీకత్తుపై బెయిల్​ మంజూరైనట్లు సమాచారం. ఆయనతో పాటు శిక్ష ఖరారైన మరో ఇద్దరికీ బెయిల్​ మంజూరైంది.

ఇదీ చూడండి: క్రికెట్ స్కామ్​లో ఫరూఖ్ పాత్రపై ఈడీ విచారణ

Last Updated : Oct 26, 2020, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.