వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ విశ్వాసం వ్యక్తం చేశారు. దిల్లీలో జరిగిన భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... టీకా అభివృద్ధి కోసం వేగంగా పరిశోధనలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 3 టీకాలకు సంబంధించి ప్రయోగ పరీక్షలు జరుగుతున్నట్లు చెప్పారు.
కొవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించినట్లు హర్షవర్ధన్ తెలిపారు. ఆన్‌లైన్ పోర్టల్‌కు వెళితే వ్యాక్సిన్ ట్రయల్స్ సమాచారం మొత్తం లభ్యమవుతుందన్నారు. ఐసీఎంఆర్ వందేళ్ల టైమ్‌లైన్‌ను విడుదల చేయడం గర్వంగా ఉందన్నారు. భావితరాల శాస్త్రవేత్తలకు ఐసీఎంఆర్ ప్రేరణగా నిలుస్తుందని హర్షవర్దన్ కొనియాడారు.
ఇదీ చూడండి: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్