ETV Bharat / bharat

మహారాష్ట్రలో మాస్క్​ల అపహరణ.. నిందితుడు ఫార్మాసిస్టే!

కరోనా వైరస్​ ప్రభావం మాస్క్​ల​పై పడింది. వాటికి డిమాండ్​ పెరిగిన నేపథ్యంలో మహారాష్ట్ర పుణెలో ఓ ఫార్మాసిస్టు మాస్క్​లు, మందులు అపహరించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Coronavirus scare: Maharashtra pharmacist held for stealing masks
మహారాష్ట్రలో మాస్క్​ల అపహరణ.. నిందితుడు ఫార్మసిస్టే!
author img

By

Published : Mar 9, 2020, 2:32 PM IST

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఆరోగ్యపరంగానే గాక.. ఆర్థికంగానూ పెను భారంగా మారింది. మహమ్మారి సోకకుండా ఉండేందుకు మాస్క్​లు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో వాటికి డిమాండ్ పెరిగిపోయింది. ఇదే అదునుగా భావించిన మహారాష్ట్ర పుణెలోని ఓ మందుల దుకాణంలో పనిచేస్తున్న ఫార్మాసిస్టు మాస్క్​లు, ఇతర మందులను అపహరించాడు.

నిందితుడిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి నుంచి మాస్క్​లు, ఇంజక్షన్లు, మందులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:కేరళ చిన్నారికి కరోనా- 42కు చేరిన బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.