ETV Bharat / bharat

మాకూ వేసవి సెలవులు కావాలి : సుప్రీంకోర్టు న్యాయవాదులు

కరోనా వైరస్​ చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో తమకు ముందుగానే వేసవి సెలవులు ప్రకటించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిఫార్సు చేసేందుకు సిద్ధమైంది న్యాయాదుల సమాఖ్య. మార్చి 23 నుంచి నాలుగు వారాల పాటు సెలవులు ఇవ్వాలని కోరనున్నట్లు పేర్కొంది.

author img

By

Published : Mar 21, 2020, 9:29 PM IST

Coronavirus: SC lawyer bodies appeal to CJI to declare holidays for 2-4 weeks
'న్యాయవాదులకు నాలుగు వారాలు సెలవులు ఇవ్వాలి'

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమకు వేసవి సెలవులను ముందుగానే ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డెకు సిఫార్సు చేయాలని నిర్ణయించింది న్యాయవాదుల సమాఖ్య. శనివారం జరిగిన సుప్రీంకోర్టు బార్​ అసోసియేషన్​(ఎస్సీబీఏ) కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 23 నుంచి నాలుగు వారాల పాటు సెలవులను ప్రకటించాలని కోరనున్నట్లు వెల్లడించారు.

ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఈసీ) సూచనల మేరకు ఈ సెలవులను కోరినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే పరిస్థితిని పరిశీలించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఈసీ నిర్ణయించినట్లు తెలిపారు. సేవలను అందించడానికి ఏ సమయంలోనైనా న్యాయవాదులు సిద్ధంగా ఉండాలని ఈసీ తీర్మానించింది.

మాకూ కావాలి..

తమకు కూడా కనీసం రెండు వారాల పాటు సెలవులను ఇవ్వాలని సీజేఐకు సిఫార్సు చేసేందుకు సిద్ధమయ్యారు సుప్రీంకోర్టు అడ్వకేట్​ ​ఆన్ రికార్డ్​ అసోసియేషన్(ఎస్​సీఎఓఆర్​ఏ)​ సభ్యులు. సాధారణంగా మే 18 నుంచి జులై 5 వరకు వేసవి సెలవులను ఇస్తారు. అయితే కరోనా నేపథ్యంలో వేసవి సెలవులను ముందుగానే కోరుతున్నారు న్యాయవాదులు.

సెలవుల ప్రతిపాదనను సుప్రీం అగీకరించేందుకు అభ్యంతరాలుంటే.. తమ వద్ద కొన్ని సూచనలున్నట్లు ఎస్​సీఏఓఆర్​ఏ పేర్కొంది. డెత్​ వారెంట్లు, బెయిల్​, కస్టడీ, హెబియస్​ కార్పస్​ వంటి పిటిషన్లు మినహా.. ఇతర వ్యాజ్యాల దాఖలు పూర్తిగా నిలిపేయాలని న్యాయవాదుల సమాఖ్య సూచించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.