ETV Bharat / bharat

కర్ణాటకలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 9,386 కేసులు - #Covid-19

భారత్​లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో ఇప్పటికే 33 లక్షల మంది వైరస్​ బారిన పడగా.. 60 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తర్​ప్రదేశ్​, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల్లో కొవిడ్​ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి.

Coronavirus new cases and deaths in India
కర్ణాటకలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 9,386 కేసులు
author img

By

Published : Aug 27, 2020, 7:59 PM IST

Updated : Aug 27, 2020, 8:59 PM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. కర్ణాటకలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 9,386 కేసులు వెలుగుచూశాయి. మరో 141మంది కొవిడ్​కు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 9వేలు దాటింది.

మహా కరోనా పంజా...

మహారాష్ట్రలో ఒక్కరోజే 14,718మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో 355 మంది వైరస్​కు బలయ్యారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7 లక్షల 33వేలు దాటగా... ఇప్పటివరకు 23,444 మంది మరణించారు.

తమిళనాట 4లక్షలు దాటిన కేసులు

తమిళనాడులో మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 4లక్షల 3వేలు దాటింది. కొత్తగా రాష్ట్రంలో 5,981 కొవిడ్​ కేసులు బయటపడగా... మరో 109మంది చనిపోయారు.

ఉత్తర్​ప్రదేశ్​

యూపీలో తాజాగా 5,463 మంది మహమ్మారి బారిన పడ్డారు. 76 మంది కరోనాకు బలయ్యారు.

  • బంగాల్​లో ఒక్కరోజే 2,997 మందికి కరోనా సోకింది. మరో 53మంది మృత్యువాతపడ్డారు.
  • కేరళలో తాజాగా 2,406 కేసులు బయటపడగా... 10 మంది చనిపోయారు.
  • దిల్లీలో కొత్తగా 1,840 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. మరో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • పంజాబ్​లో గురువారం 1,746 మంది కరోనా బారిన పడ్డారు.
  • జమ్ముకశ్మీర్​లో కొత్తగా 655మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో 14 మంది మృతి చెందారు.

ఇదీ చూడండి: 'ఎన్ని ఆధారాలిచ్చినా పాక్ పనిచేయదంతే'

Last Updated : Aug 27, 2020, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.